నిమ్మగడ్డ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు : అంబటి

Ambati Rambabu fires over AP SEC Nimmagadda : ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ.. చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎస్‌ఈసీ కాలరాస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే పెద్దిరెడ్డిపై కక్ష కట్టారని పేర్కొన్నారు. మంత్రిని కట్టడి చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదన్నారు.
రాజ్యాంగం ముసుగులో పరుల హక్కులను హరిస్తే చర్యలు తప్పవని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రెస్‌మీట్ పెట్టి తప్పును తప్పు అని చెబితే మంత్రిపై ఆంక్షలు విధిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.