Chejarla Subbareddy : నీకు దమ్ముంటే రా.. ఎమ్మెల్యే మేకపాటికి సవాల్ విసిరిన చేజర్ల సుబ్బారెడ్డి

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ తో వైసీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. బస్టాండ్ సెంటర్ దగ్గర సుబ్బారెడ్డి కుర్చీల్లో కూర్చుని వైసీపీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.

Chejarla Subbareddy : నీకు దమ్ముంటే రా.. ఎమ్మెల్యే మేకపాటికి సవాల్ విసిరిన చేజర్ల సుబ్బారెడ్డి

Chejarla Subbareddy (1)

Updated On : March 31, 2023 / 12:35 PM IST

Chejarla Subbareddy : నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ తో వైసీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. దమ్ముంటే రావాలని చంద్రశేఖర్ రెడ్డికి సుబ్బారెడ్డి సవాల్ చేశారు. బస్టాండ్ సెంటర్ దగ్గర సుబ్బారెడ్డి కుర్చీల్లో కూర్చుని వైసీపీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.  ఈ సందర్భంగా చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ భకాసుర ఎమ్మెల్యే పీడ విరగడయిందని వ్యాఖ్యానించారు.

అవినీతి ఎమ్మెల్యేని జగన్ బయటకు సాగ నంపారని తెలిపారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మగవాడైతే, దమ్ముంటే ఉదయగిరికి రావాలని సవాల్ చేశారు. ఏ టైంలో వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉదయగిరికి వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటామన్నారు. ఎమ్మెల్యే రమ్మంటే మర్రిపాడులోని ఆయన నివాసం వద్దకు వస్తామని చెప్పారు.

Nellore Lok Sabha Constituency : సింహపురిలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? నెల్లూరు టీడీపీలో కనిపిస్తున్న కొత్త జోష్

చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి అంతా కాదన్నారు. నాయకులంతా కష్ట పడితేనే ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించాలంటే సంస్కారం అడ్డు వస్తోందన్నారు. ‘నువ్వు రాకపోతే మగాడివి కాదని ముద్ర వేస్తాం.. మీ ఇంటికి వస్తా ..దమ్ముంటే నా ఆరోపణలకు సమాధానం ఇవ్వు’ అని సవాల్ విసిరారు.

అంగన్ వాడీ ఆయా పోస్టులను కూడా అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. కనీసం ఫోన్ లో అయినా తనతో మాట్లాడే ధైర్యం ఎమ్మెల్యేకు ఉందా అని ప్రవ్నించారు. చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి దమ్ముంటే రావాలని సుబ్బారెడ్డి సవాల్ చేశారు. అంతకముందు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సుబ్బారెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.