Malladi Vishnu: నాని మాట్లాడింది తప్పు.. టిక్కెట్ల తగ్గింపు పేదలకే మేలు!

ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలనే ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

Malladi Vishnu: నాని మాట్లాడింది తప్పు.. టిక్కెట్ల తగ్గింపు పేదలకే మేలు!

Nan

Updated On : December 23, 2021 / 4:37 PM IST

Malladi Vishnu: ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలనే ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టిక్కెట్ల రేట్లు తగ్గింపుపై హీరో నాని మాట్లాడింది తప్పు అని అభిప్రాయపడ్డారు విష్ణు. సినిమా టికెట్ల ధరలు తగ్గించడం నానికి నచ్చలేదని, నానికి డబ్బులు ఎక్కువ రావాలన్నారు.. సంపాదనే ప్రధాన ధ్యేయం అన్నట్లుగా నాని మాట్లాడారని అన్నారు.

నాని వ్యాఖ్యలను మేం పరిగణనలోకి తీసుకోబోమని చెప్పిన విష్ణు.. ఆయనకు మాకు లెక్కలేముoటాయని ప్రశ్నించారు. నాని మాకేమైనా ప్రత్యర్థియా? అని ప్రశ్నించారు. నాని అలా ఊహించుకుంటే, లెక్కలేమైనా తెల్చుకోవాలి అంటే, ఎక్కడైనా ఎప్పుడైనా తేల్చుకుంటామని అన్నారు. మా పార్టీని, నాయకుడిని, ప్రభుత్వాన్ని, ఎదుర్కొన్న వాళ్ళు ఏమయ్యారో చూశారుగా అని హెచ్చరించారు.

రాష్ట్రంలో థియేటర్లు అన్నీ ఒకరిద్దరు కంట్రోల్లోనే ఉన్నాయని, వాళ్లకు మాత్రమే నష్టం తప్ప మరొకరికి లేదని అన్నారు. సినిమా టికెట్ల ధరలు తగ్గితే ప్రేక్షకులకు మంచిదని, ప్రభుత్వంపై ఏదో మాట్లాడాలని మాట్లాడటం మాత్రం మంచిది కాదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల వలన ప్రజలపై భారం ఉండదని చెప్పుకొచ్చారు నాని.