Gorantla Madhav : సజ్జలతో గొడవపడినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గోరంట్ల మాధవ్.. ఏమన్నారంటే?

వైసీపీ నాకు రాజకీయం ఇచ్చిన కన్నతల్లి లాంటిది, రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చి జగన్ నన్ను ఎంపీని చేసి ఢిల్లీ పంపారని గోరంట్ల మాధవ్ అన్నారు.

Gorantla Madhav : సజ్జలతో గొడవపడినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గోరంట్ల మాధవ్.. ఏమన్నారంటే?

gorantla Madhav

YCP MP Gorantla Madhav : టీడీపీ సోషల్ మీడియా నా విషయంలో లేనిపోని హడావిడి చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిందని, 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు మాత్రమే మిగులుతాయని మాధవ్ జోస్యం చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే సీఎం జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పులు చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో పెట్టాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.

Also Read : YS Jagan : సార్ ఎలా ఉన్నారు.. కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్

వైసీపీ నాకు రాజకీయం ఇచ్చిన కన్నతల్లి లాంటిది, రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చి జగన్ నన్ను ఎంపీని చేసి ఢిల్లీ పంపారని గోరంట్ల మాధవ్ అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవ పడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి అందరినీ ఓర్పుతో మాట్లాడతారని, అలాంటి వ్యక్తితో నాకు గొడవ ఎందుకు ఉంటుందని అన్నారు. మా పార్టీలో కలహాలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి గోరంట్ల వ్యాఖ్యానించారు.

సీఎం కార్యాలయం మాకు ఇల్లు లాంటిది.. రోజుకు పదిసార్లు వస్తా.. మీకేంటి ప్రాబ్లమ్.. పార్టీ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మాకు శిరోధార్యం అని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.