YCP MP Vijayasai Reddy : స్పీకర్‌పై విజయ సాయిరెడ్డి ఫైర్
ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.

Ycp Mp Vijayasai Reddy
YCP MP Vijayasai Reddy : ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు,కృష్ణా జలాలపై తెలంగాణ వైఖరి సహా నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రి తో చర్చించినట్లు ఆయన చెప్పారు. కెఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులను సీఐఎస్ఎఫ్ బలగాలతో నోటిపై చెయాలని కోరామని ఆయన తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని…విశాఖ కు తాగునీరు విషయంలో ఏలేశ్వరం నుంచి నరవకి తాగునీటి సరఫరా ప్రాజెక్టులో సగం ఖర్చు జల్ జీవన్ మిషన్ నుంచి కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా చేపడుతున్న ప్రాజెక్టులపై విజయసాయిరెడ్డి మంత్రికి ఫిర్యాదుచేశారు.
గురువారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు వేయాలని కోరినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిని పార్టీ నేతలను ఉద్దేశించి రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యలు దుర్భాష లను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిట్లు చెప్పారు. రఘురామకృష్ణరాజు పై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు.
కాగా…. గత స్పీకర్ల కు భిన్నంగా పక్షపాత వైఖరితో స్పీకర్ వ్యవహరిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు వేదికగా వైసిపి ఎంపీలంతా నిరసన తెలియ పరుస్తామని అన్నారు. మేము ఫిర్యాదు ఇచ్చి ఏడాది అవుతున్నా స్పీకర్ చర్యలు తీసుకోలేదని… గతంలో శరద్ యాదవ్ విషయంలో రాజ్యసభ చైర్మన్ వెంటనే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని….అవసరం లేకపోయినా సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపుతామని స్పీకర్ చెప్తున్నారని… స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.