ఏం బతుకులు మీవి..ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ఫైర్

ఏం బతుకులు మీవి అంటూ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారంటూ మండిపడ్డారు. దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారంటూ విమర్శలు చేశారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండంటూ సవాల్ విసిరారు. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరని ట్విట్టర్ లో తెలిపారు.
అలాగే మద్యం విషయంలో కూడా ట్వీట్స్ చేశారు విజయసాయిరెడ్డి. మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్నవారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసిందాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేడన్నారు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమై భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారన్నారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదని విమర్శించారు.
మద్యం ధరలు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నారని రంకెలేస్తాడు…పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే అడ్డుపడతాడు..ఇన్ సైడర్ ట్రేడింగు పైనా దర్యాప్తు జరపొద్దట..తన మాజీ పిఎస్ అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు…ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?
దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 23, 2020
విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 23, 2020