నోటి దూల : పృథ్వీ వాఖ్యలపై వైసీపీ సీరియస్

30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ డైలాగ్‌తో పాపులర్ అయిన టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్ష పార్టీ, రాజధాని రైతులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఆయన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిచింది పార్టీ అధిష్టానం. కులాలను ప్రస్తావిస్తూ ఎవరూ మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజధాని ప్రాంతాలకు చెందిన రైతులు, మహిళలు, ఇతరులు పాల్గొంటున్నారు. వీరికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సపోర్టు చేసింది. నిరసనలు, ఆందోళనలు పాల్గొంటోంది. అయితే..ఆందోళనల్లో పాల్గొంటున్న వారు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. పృథ్వీ ఒక అడుగు ముందుకు వేసి ఆందోళనలో పాల్గొన్న వారిలో కొందరు తనతో కలిసి ఆర్టిస్టులుగా పని చేశారని, రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా? బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా అంటూ పృథ్వీ విమర్శలు గుప్పించారు.
దీనిపై నటుడు పోసాని కృష్ణ మురళీ తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. రైతులకు కార్లు ఉండకూడదా అని ప్రశ్నించారు. పొలం పని చేసే మహిళలు బంగారు గాజులు కొనుక్కోకూడదనా అని నిలదీశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు పృథ్వీ సిగ్గు పడాలని.. పృథ్వీకి ఏ మాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజధానిలో మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిపై పృథ్వీ కూడా రెస్పాండ్ అయ్యారు. నేను రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదన్నారు. రైతుల ముసుగులోని బినామీలను మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులు అన్నాను అని చెప్పారు. రాజధానిలో ధర్నా చేస్తున్న వారిలో నాతో పని చేసిన ఆర్టిస్టులు ఉన్నారని పృథ్వీ మరోసారి స్పష్టం చేశారు. వివాదం మరింత ముదర ముందే చర్యలు తీసుకోవాలని వైసీపీ భావిస్తోంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
Read More : కవాతు లేనట్లే : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్