YV Subbareddy : కాంగ్రెస్ తో షర్మిల కలిసినా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వైసీపీదే అధికారం : వైవీ సుబ్బారెడ్డి
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.

YV Subbareddy (1)
YCP Leader YV Subbareddy : కేంద్రంలో పరిస్థితి చూస్తే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనే దానిపై సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యం అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. బాలినేనిపై తాను ఎలాంటి కుట్రలు చేయలేదన్నారు.
బాలినేని ఎందుకు అంటున్నారో, ఎవరిపై అంటున్నారో తనకు తెలియదని చెప్పారు. ఏంతో నిజాయితీ పరుడ్ని అంటున్న చంద్రబాబు ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఏ ఆధారాలు లేనిదే ఐటీ అధికారులు నోటీసులు జారీ చేయరని పేర్కొన్నారు. వారాహి, యువగళం లాంటి ఎన్నియాత్రలు చేసినా ఈసారి ప్రజల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు.
CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన.. సతీసమేతంగా ప్రత్యేక విమానంలో లండన్ కు పయనం
సీఎం జగన్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ తో షర్మిల కలిసినా, ఎవరు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా మరోసారి వైసీపీ గెలుపు తథ్యం అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారని వెల్లడించారు. దొంగ ఓట్ల నమోదుపై దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు వైఖరీ ఉందన్నారు.
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు. ప్రజా బలంతో చంద్రబాబు ఏ రోజూ ముఖ్యమంత్రి కాలేదని.. ఇతరుల మద్దతుతోటే సీఎం అయ్యాడని ఎద్దేవా చేశారు. అందుకే దీనిని కూడా ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడని విమర్శించారు.
Kesineni Nani : విజయవాడ నాదే.. మరోసారి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర్ రెడ్డిపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పడు తమకు తెలియదంటూ ఏదేదో మాట్లాడుతారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ పెద్దలను అడుగు పెట్టనివ్వనన్న చంద్రబాబు అదే బీజేపీతో నేడు అంట కాగాలని చూస్తున్నాడని ఆరోపించారు.