Selfie Danger: సెల్ఫీ మోజులో కరెంట్ షాక్ కు గురైన యువకుడు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజుతో ఓ యువకుడు ప్రమాదనికి గురయ్యాడు.

Selfie Danger: సెల్ఫీ మోజులో కరెంట్ షాక్ కు గురైన యువకుడు

Selfie Danger

Updated On : January 26, 2022 / 9:34 PM IST

Selfie Danger: సెల్ఫీలతో ప్రాణాలు పోతున్నా..కొందరు యువతలో మార్పు రావడంలేదు. సెల్ఫీ మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజుతో ఓ యువకుడు ప్రమాదనికి గురయ్యాడు. కటికం వీరబ్రహ్మం అనే యువకుడు… పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి.. సెల్ ఫోన్ తో సెల్ఫీ దిగుతున్నాడు. ఈక్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి వీరబ్రహ్మం ప్రమాదానికి గుర్రయ్యడు.

Also read: Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో తిరుమల తరహా భద్రత

ఇది గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరబ్రహ్మంను రైల్వే పోలీసులు 108 వాహనంలో పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి వీరబ్రహ్మం శరీరం సగానికి పైగా కాలిపోయిందని..పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Corona Omicron : ఒమిక్రాన్ ఎందుకంత వేగంగా విస్తరిస్తుందో తెలిసింది