జగన్ పులివెందుల పర్యటన వాయిదా, విస్తృత స్థాయి సమావేశం తేదీ మార్పు
భవిష్యత్ కార్యాచరణపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారని సమాచారం.

Ys Jagan Mohan Reddy
Ys Jagan : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ముందుగా ఈ నెల 22న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. అందుకు బదులుగా ఈ నెల 20వ తేదీనే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది వైసీపీ.
ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు జగన్ వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారని సమాచారం.
Also Read : ఎవర్నీ వదలం.. ఆరోగ్యశ్రీ పథకంపై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
ఇక, జగన్ తన పులివెందుల పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపు (జూన్ 19) జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తాజాగా ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.