Minister Roja : నగరిలో మంత్రి రోజాకు లైన్ క్లియర్..? అసమ్మతి నేతలకు సర్దిచెప్పిన జగన్!
Minister Roja : నగరి టికెట్ విషయంలో మంత్రి రోజాకు లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. అసమ్మతి నేతలకు సర్ది చెప్పిన జగన్.. అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

YS Jagan Mohan Reddy Line Clear to Minister Roja Over Nagari Ticket Issue
Minister Roja : నగరి టికెట్ విషయంలో మంత్రి రోజాకు సీఎం జగన్ లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాపై వ్యతిరేకత పెరుగుతోంది. నియోజకవర్గ పరిధిలోని నేతలు రోజాని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలలో రోజాకు టికెట్ ఇస్తే సహించేది లేదని కొంతమంది వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Bjp Janasena Candidates List : బీజేపీ-జనసేన అభ్యర్థులు వీళ్లే..!
నగరిలో రోజాకి తప్ప ఇతరులు ఎవరికి సీటు కేటాయించినా తాము గెలిపిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా సీఎం జగన్ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ నగరి టికెట్ విషయంలో మంత్రి రోజాకు లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. అసమ్మతి నేతలకు సర్ది చెప్పిన జగన్.. అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది.
అంబటిని గెలిపించాల్సిన బాధ్యత మనదే :
మరోవైపు.. సత్తెనపల్లి, నరసరావుపేట, నగరి అసంతృప్త నేతలకు కూడా సీఎం జగన్ సర్దిచెప్పారు. కొన్నిరోజులుగా మంత్రి అంబటి, పలువురు నేతలకు మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. అంబటిని గెలిపించాల్సిన బాధ్యత తమదేనని అసంతృప్త నేతలకు జగన్ సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని అసంతృప్త నేతలకు భరోసా ఇచ్చారు.
అందరితో కలిసి పనిచేయాలి :
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్‌కు ఆరుగురు సంతృప్త నేతలు వివరించారు. తమ రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీసేలా గోపిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ నేతలు వాపోయారు. ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తనదని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించేందుకు అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ సర్దిచెప్పారు.
Read Also : YCP: ఈ నెల 16న అభ్యర్థుల ప్రకటన.. 18 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం