ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ట్వీట్.. కీలక వ్యాఖ్యలు
YS Jagan: ‘ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.

CM Jagan
ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో జగన్ ఓ పోస్ట్ చేశారు.
‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన వైసీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు. కాగా, సోమవారం ఏపీలో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. తమ పార్టీయే గెలుస్తుందని ప్రధాన పార్టీల నేతలు అంటున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నా. మే 1న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతాయి.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఆగని ఉద్రిక్తతలు.. కడప జిల్లాలో నేతలకు భద్రత పెంపు