Ys Sharmila: కేసీఆర్‌పై షర్మిల దుమారపు ట్వీట్

Ys Sharmila: కేసీఆర్‌పై షర్మిల దుమారపు ట్వీట్

Ys Sharmila

Updated On : June 6, 2021 / 5:44 PM IST

Ys Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిళ కీలక కామెంట్లు చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరతపై ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. తెలంగాణ యాసతో రెండు ట్వీట్లుగా పోస్టు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ కు దొరుకుతున్న వ్యాక్సిన్ మీకెందుకు దొరకడం లేదని అడిగారు.

ప్రముఖ ప్రింట్ మీడియాలో ప్రచురితమైన ప్రైవేట్ ఆస్పత్రుల టీకా దందా అనే అంశాన్ని ఫొటోగా పోస్టు చేశారు. దానితో పాటు ట్వీట్ లో కామెంట్లు చేశారు.

1. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?

2. తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి.

అంటూ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ట్వీట్ లో పేర్కొన్నారు.