TDP : స్వేచ్చగా ఓటింగ్ జరిగితే పులివెందులలో కూడా జగన్‌కు ఇబ్బందే- టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

పులివెందులలో కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామన్నారు.

TDP : స్వేచ్చగా ఓటింగ్ జరిగితే పులివెందులలో కూడా జగన్‌కు ఇబ్బందే- టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

YSRCP Activists Joins TDP (Photo : Google)

Updated On : December 14, 2023 / 9:11 PM IST

ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎన్నికల వేడి కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ , చంద్రబాబు సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఒకరిపై మరొకరు డైరెక్ట్ గానే విమర్శలు చేసుకుంటున్నారు. ఇక కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకున్నారు.

కదిరి నియోజకవర్గం నుండి దాదాపు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఏలూరు నియోజకవర్గం నుంచి మాజీమంత్రి మరడాని రంగారావు సైకిల్ ఎక్కారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన ఆటో యూనియన్ లీడర్ నగరబోయిన లీలా కృష్ణ, 100మందికి పైగా అనుచరులు, మద్దతుదారులు టీడీపీలో జాయిన్ అయ్యారు.

Also Read : వినూత్న పద్ధతిలో సర్వే.. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామని వారు వెల్లడించారు. కదిరిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. తమ పక్క నియోజకవర్గం పులివెందులలో కూడా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని టీడీపీలో చేరిన కార్యకర్తలు తెలిపారు. స్వేచ్చగా ఓటింగ్ జరిగితే పులివెందులలో కూడా జగన్ కు ఇబ్బంది తప్పదని కదిరి నుంచి వచ్చిన కార్యకర్తలు వెల్లడించారు. పోలీస్ ఫైన్లు, పన్నులు, మద్యం రేట్లు, పెట్రో ధరల బాదుడుతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో యూనియన్ నేతలు చంద్రబాబు ముందు వాపోయారు.

Also Read : విశాఖపై పట్టు పెంచుకోడానికి వైసీపీ ప్రయత్నం.. వారిని కొనసాగిస్తారా, తప్పిస్తారా?