ఏపీ హైకోర్టులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట
ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.

Pinnelli Ramakrishna Reddy
Pinnelli Ramakrishna Reddy: ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పల్నాడు జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిన్నెల్లిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 10రోజుల తరువాతకు వాయిదా వేసింది.