Rachamallu Siva Prasad Reddy: షర్మిలమ్మ… ఆస్తితో పాటు భారతమ్మని కూడా టార్గెట్ చేసింది : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
Rachamallu Siva Prasad Reddy : మాజా ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తితో పాటు.. భారతమ్మను కూడా షర్మిలమ్మ టార్గెట్ చేసిందని ఆరోపించారు.
ysrcp leader Rachamallu Siva Prasad Reddy slams over ys sharmila comments on vijayamma letter
Rachamallu Siva Prasad Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం ఆస్తుల పంపకం అంశం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి ఆస్తుల పంపకంపై వైఎస్ విజయమ్మ రాసిన లేఖ సంచలనం సృష్టించింది. తాజాగా ఈ అంశంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ.. విజయమ్మ రాసిన లేఖ వాస్తవం అని చెప్పుకొచ్చారు. ఆ లేఖ మీద జగన్కు సమాధానం చెప్పే దమ్ములేకనే జగన్.. తన కుక్కలతో మొరిగిస్తున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
షర్మిల వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మ టార్గెట్.. ఆస్తితో పాటు భారతమ్మ కూడా అన్నారు. తమల్ని కుక్కలతో పోల్చినందుకు సంతోషం అని.. తమకు విశ్వాసం ఉందని అందుకే మొరుగుతున్నాం అన్నారు. శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘షర్మిలమ్మ మమ్మల్ని కుక్కలతో పోల్చారు. మేము విశ్వాసం ఉన్న జాతి కుక్కలం. యజమాని ఇంట్లో దొంగలు పడితే తప్పకుండా మొరుగుతాము’ అన్నారు.
‘మేము విజయమ్మ లేఖ రాయలేదు అనలేదు.. నోటరీ చేసి బలవంతంగా రాయించారని చెప్పాం. జగన్కు దమ్ము, ధైర్యం లేక వేరే వారితో మాట్లాడించారని షర్మిలమ్మ అన్నారు… దమ్ము ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్. షర్మిలమ్మ టార్గెట్ ఆస్తితో పాటు… భారతమ్మ కూడా’ అంటూ శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే వివేకా కేసుపై స్పందిస్తూ.. ‘వివేకానందరెడ్డి గుండెపోటు అన్న అంశం సాక్షిలోనే కాదు… అన్ని మీడియా ఛానళ్లలోనూ వచ్చింది. మీ పచ్చ మీడియాలో కూడా గుండెపోటు అనే వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు…? వివేకా మరణం గురించి ముందుగా ఆయన బావమరది శివప్రకాష్ రెడ్డే అందరికీ సమాచారం అందించారు’ అని తెలిపారు.
