Ambati Rambabu: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.

Ambati Rambabu: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి!

Ambati Rambabu Commented On Tdp Ap Politics1

Updated On : January 16, 2022 / 10:54 AM IST

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినీ రాజకీయాల్లో వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మూడోసారి కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు.

ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గతంలో రెండు సార్లు రాంబాబుకు కరోనా రాగా.. ఇప్పుడు మరోసారి వచ్చిందని, జలుబు, నొప్పులు రాగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని, రిపోర్ట్స్‌లో పాజిటివ్ వచ్చిందని చెప్పారు రాంబాబు.

కోవిడ్ పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లోకి వెళ్తున్నానని, తనను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని కోరారు రాంబాబు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల భోగి రోజు అంబటి రాంబాబు డ్యాన్సులు వేస్తూ సంక్రాంతి సంబరాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.