ఈవీఎం ధ్వంసం కేసు.. మొత్తం వీడియోని బయటపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్

అందరినీ సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుంది. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు.

ఈవీఎం ధ్వంసం కేసు.. మొత్తం వీడియోని బయటపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్

Kasu Mahesh Reddy : ఏడెనిమిది చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఎలక్షన్ కమిషన్ చెబుతోందని, ఆ వీడియోలన్నీ ఈసీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి. ప్రస్తుతం ఒక మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చిందని, మిగతా వీడియోల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. పాల్వాయి గేట్ బూలింగ్ బూత్ లో మొదట తమ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందని, ఆ వీడియో క్లిప్పింగ్స్ మొత్తం ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

మాచర్లలో మొత్తం అల్లర్లకు ప్రధాన కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి అని ఆరోపించారు. అందరినీ సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుందన్నారు కాసు మహేశ్ రెడ్డి. గురజాల, మాచర్లలో పోలింగ్ సరళిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని కాసు మహేశ్ రెడ్డి చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడని టీడీపీ నేతలు పదే పదే ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. మాచర్ల నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారని ఆయన చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఏడెనిమిది చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని చెబుతోంది, కానీ ఒక్క మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. పాలువాయి గేట్ పోలింగ్ బూత్ లో మొదట మా కార్యకర్తలపై దాడి జరిగింది అని ఆయన ఆరోపించారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ మొత్తం ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

”పోలింగ్ సరళిలో ఒక పార్టీ వారు చేసిన దాడిని మాత్రమే బయపెట్టారు. గురజాల, మాచర్ల పోలింగ్ సరళిపై మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. పిన్నెల్లి దాడి ఘటన ముందు ఏం జరిగిందో మొత్తం వీడియోని బయటపెట్టాలి. ఏం జరిగినా మాచర్లలో రామకృష్ణారెడ్డి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు.
మాచర్లలో అల్లర్లకు ప్రధాన కారణం జూలకంటి బ్రహ్మారెడ్డే. కొత్త గణేశునిపాడులో మా కార్యకర్తల ఇళ్లపైకి వచ్చి దాడి చేశారు. మాచర్ల, గురజాలలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియ వీడియో క్లిప్పింగ్స్ ఎందుకు బయటకు రాలేదు.

అందరినీ సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుంది. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో ఏకపక్షంగా వ్యవహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటాము. గొడవలు జరగకుండా ఉండాలని ఇరు పార్టీల నేతలని బయట ఉండాలని చెప్పారు” అని కాసు మహేశ్ రెడ్డి తెలిపారు.

Also Read : ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈసీ సీరియస్.. పిన్నెల్లి గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశం!