KA Paul : వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా అవినీతి చేస్తున్నారు.. చంద్రబాబు దొరికిపోయారు- కేఏ పాల్

వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు చేస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీకి గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చింది. KA Paul Allegations

KA Paul : వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా అవినీతి చేస్తున్నారు.. చంద్రబాబు దొరికిపోయారు- కేఏ పాల్

KA Paul Allegations (Photo : Google)

Updated On : September 13, 2023 / 10:12 PM IST

KA Paul Allegations : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఏపీ రాష్ట్ర రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ..ఇలా ఏ పార్టీని ఆయన వదల్లేదు. అన్ని పార్టీల దుమ్ముదులిపారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో.. టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ ద్వారా ఆ మూడు పార్టీల మీద పోరాటం చేస్తాను అని చెప్పారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా అవినీతి చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. విజయనగరంలో కేఏ పాల్ మాట్లాడారు. మంత్రి బొత్స నారాయణ టార్గెట్ గా నిప్పులు చెరిగారు.

”విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఉన్న ఫార్మా కంపెనీలు తమకొచ్చే లాభాల్లో 10 శాతం కూడా రెండు జిల్లాల ప్రజలకి ఖర్చు పెట్టడం లేదు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఫార్మా కంపెనీలకి హెచ్చరిక కూడా చేశాను. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీస నియమ నిబంధనలు పాటించడం లేదు. వాళ్ళతో రాజకీయ పార్టీల నేతలు కుమ్మక్కైపోయారు. కనీస ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. మౌలిక సదుపాయాలూ కల్పించడం లేదు. మానవత్వం లేకుండా ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి.

Also Read..Chandrababu: చంద్రబాబుకు ఇండియా కూటమి ఆపన్న హస్తం.. సేఫ్ గేమ్ ఆడేందుకే సీబీఎన్ మొగ్గు!

నా జీవితంలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో సాయం చేశాను. మోడీ, అదానీ ఏం చెబితే అది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. పొలిటికల్ అవినీతి బాగా పెరిగిపోయింది. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులతో సహా అన్ని రంగాల్లో ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు చేస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ మోదీతో కలిసిపోయి రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయి. బొత్స సత్యనారాయణ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే రాజకీయాలు చేయాలా?

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కనీస అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోతే ఆయనకి పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు సపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అప్పు బాగా పెరిగిపోయింది. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, టీడీపీకి గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చింది. ప్రజాశాంతి పార్టీ ద్వారా ఆ మూడు పార్టీల మీద పోరాటం చేస్తాను. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా అవినీతి చేస్తున్నారు. సెప్టెంబర్ 24న ఛలో విశాఖపట్నంకి పిలుపు ఇస్తున్నాం” అని కేఏ పాల్ అన్నారు.

Also Read..Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్