MLC Challa Bhageerath Reddy : వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత, తీవ్ర విషాదంలో కుటుంబసభ్యులు
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(46) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల 25న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. నిన్న తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స అందించారు డాక్టర్లు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారు.

MLC Challa Bhageerath Reddy : వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(46) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం భగీరథ రెడ్డిని కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించారు. నిన్న తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స అందించారు డాక్టర్లు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో మృతి చెందారు.
దివంగత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి సంతానమే చల్లా భగీరథ రెడ్డి. చల్లా రామకృష్ణా రెడ్డి వారసుడిగా భగీరథ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో చల్లా రామకృష్ణా రెడ్డి ఆకస్మిక మృతితో భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. చల్లా భగీరథ రెడ్డి 1976 ఆగస్టు 30న జన్మించారు. ఓయూ నుంచి MA పొలిటికల్ సైన్స్ చేశారు.
2020 డిసెంబర్ 31న చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారినపడి మృతిచెందారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఆయన కుమారుడైన భగీరథ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ భగీరథ రెడ్డి కూడా కన్నుమూశారు. దీంతో, చల్లా కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. అవుకులో విషాదఛాయలు అలుముకున్నాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
రేపు తెల్లవారుజామున భగీరథ రెడ్డి పార్థివదేహాన్ని అవుకు తరలించనున్నారు. రేపు సాయంత్రం అవుకులోని చల్లా ఫామ్‌హౌస్‌లో చల్లా భగీరథ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఆయన కుమారుడు భగీరథరెడ్డికి 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం జగన్. భగీరథ రెడ్డి ఎమ్మెల్సీగా 18 నెలలు కొనసాగారు. చల్లా భగీరథ రెడ్డికి భార్య చల్లా శ్రీలక్ష్మి, ఇద్దరు కుమారులు (చల్లా రాజాబి శేఖర్ రెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి). చల్లా భగీరథ రెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి అవుకు జడ్పీటీసీగా కొనసాగుతున్నారు.
భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007-08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
చల్లా కుటుంబం టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేసింది. చల్లా రామకృష్ణారెడ్డి స్వగ్రామం అవుకు మండలంలోని ఉప్పలపాడు. రామకృష్ణారెడ్డి 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోవెలకుంట్ల స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లె నుంచి పోటీ చేసిన చల్లా.. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు.
చల్లా 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి విజయంలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరగా.. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2020లో చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు.
చల్లా భగీరథ రెడ్డి మృతికి వైసీపీ నేతలు సంతాపం తెలుపుతున్నారు. సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లాకి వెళ్లనున్నారు. భగీరథ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించనున్నారు.