YV Subbareddy : అందుకోసమే గంటా శ్రీనివాసరావు అమరావతి రాజధానిని కోరుకుంటున్నారు : వైవీ సుబ్బారెడ్డి
జనసేన అధ్యక్షుడిపై సీఎం జగన్ వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదన్నారు. ఉన్న మాటే సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు.

YV Subbareddy (2)
YV Subbareddy – TDP Leaders : టీడీపీ నేతలపై వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చ కామెర్లతో ఉన్న టీడీపీ నేతలకు వైజాగ్ అభివృద్ధి, ఆకాంక్ష పట్టదని మండిపడ్డారు. వియ్యంకుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గంటా అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ ప్రజలు కోరుకోవడం లేదంటున్న గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. దొడ్డి దారిన వైజాగ్ రావాల్సిన అవసరం తమకు లేదని.. రైట్ దారిన రాయల్ గా హైవే మీదే వస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం వైజాగ్ వస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ కావొచ్చు.. నవంబర్ కావొచ్చన్నారు.
రాజధాని వసతుల కమిటీ ఒకసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్ లు ఫైనలైజ్ అవుతాయని చెప్పారు.
జనసేన అధ్యక్షుడిపై సీఎం జగన్ వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదన్నారు. ఉన్న మాటే సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వృధా అని అన్నారు.