Tirumala Ghat Road : ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే.. అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.

Tirumala Ghat Road : ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Tirumala Ghat Road

Updated On : December 11, 2021 / 10:29 AM IST

Tirumala Ghat Road : ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చి వెళ్లాయి. చిత్తూరు, కడప జిల్లాలో వర్షాలకు నష్టపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. వర్షాల కారణంగా కలియుగ ప్రత్యేక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన ఏడు కొండలపై ఉన్న నదులు ఉప్పొంగి ప్రవహించాయి. ఏకధాటిగా వారం పాటు వర్షాలు కురవడంతో తిరుమల ఘాట్‌రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. కాలినడక మార్గం పూర్తిగా మూసుకుపోయింది.

చదవండి : Tirumala Srivari Temple : శ్రీ‌వారికి వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు విరాళం

వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లు దెబ్బతినడంతో వాటి మరమ్మత్తు పనుల్లో నిమగ్నమయ్యారు టీటీడీ అధికారులు. రోడ్డుపై బడిన బండలరాళ్లను తొలగింస్తూ.. రోడ్లు పాడైపోయిన దగ్గర కొత్త రోడ్డు వేస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ప్రాంతాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. మరమత్తు పనులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థ కు చెందిన కార్మికులతో మాట్లాడి బండరాళ్లను ఎలా తొలగిస్తున్నారు? రాళ్ళు కిందకు పడకుండా వాల్ కాంక్రీటు ఎలా చేస్తున్నారు? ఎంత మంది పనిచేస్తున్నారు? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు సుబ్బారెడ్డి.

చదవండి : Tirumala Rooms : తిరుమ‌ల‌లో వసతి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు.. సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం