Tirumala Rooms : తిరుమ‌ల‌లో వసతి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు.. సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వసతి కల్పించే విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను..

10TV Telugu News

Tirumala Rooms : తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వసతి కల్పించే విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను రద్దు చేసింది. 2022 జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో వసతి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ను టీటీడీ ర‌ద్దు చేసింది.

2022 జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి, జ‌న‌వ‌రి 14న వైకుంఠ ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌ను పుర‌స్క‌రించుకొని జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వివరించింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వచ్చే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్ద పీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది.

iPhone 13 Mini: ఐఫోన్‌పై నెవర్ బిఫోర్ ఆఫర్.. రూ.36వేలు డిస్కౌంట్

* ఎమ్‌బిసి – 34, కౌస్తుభం విశ్రాంతి భ‌వ‌నం, టిబిసి కౌంట‌ర్‌, ఎఆర్‌పి కౌంట‌ర్ల‌లో 2022 జ‌న‌వ‌రి 11వ తేదీ తెల్ల‌వారుజామున 12 గంట‌ల నుండి 14వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు గ‌దులు కేటాయింపు రద్దు.

* జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు.

* శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖుల‌కు వెంకటకళా నిల‌యం, రామరాజ నిల‌యం, సీతా నిల‌యం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి గదులు కేటాయిస్తారు.

Amazon Prime: డిసెంబర్ 13వ తేదీలోపు అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఇదే!

* స్వ‌యంగా వ‌చ్చిన ప్ర‌ముఖుల‌కు గ‌రిష్టంగా 2 గ‌దులు మాత్ర‌మే కేటాయిస్తారు.

* సామాన్య భక్తుల‌కు సీఆర్‌వో జనరల్‌ కౌంటర్‌ ద్వారా గదులు మంజూరు.

ఏడు కొండల్లో వెలసిన శ్రీవేంకటేశుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వస్తుంటారు. కలియుగ దైవాన్ని దర్శించుకుని పులకించిపోతారు. అదే సమయంలో తిరుమల శ్రీవారికి విరాళాల రూపంలో అందజేస్తుంటారు.

కొందరు భక్తులు కోట్లాది రూపాయలు శ్రీవారికి అందజేస్తుంటారు. మరికొందరు విలువైన, ఖరీదైన కానుకలు స్వామి వారికి విరాళంగా ఇస్తారు. నిలువెత్తు దోపిడీ సమర్పిస్తుంటారు. కొందరు బంగారం రూపంలో.. మరికొందరు డబ్బు రూపంలో ఇస్తారు.

×