Venu Swamy : ఏపీలో కూట‌మి హ‌వా.. వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి.

Venu Swamy : ఏపీలో కూట‌మి హ‌వా.. వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Astrologer Venu Swamy Reacts Over AP Elections Results 2024

Updated On : June 4, 2024 / 1:48 PM IST

Astrologer Venu Swamy : సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి. ఆరు నూరు అయినా స‌రే మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అవుతారంటూ ఇటీవ‌ల ఆయ‌న చేసిన కామెంట్లు తెగ వైరల్‌గా అయిన సంగ‌తి తెలిసిందే. 79 సీట్ల‌లో వైసీపీకి ఎలాంటి పోటీ ఉండ‌ద‌ని, 30 నుంచి 40 సీట్ల‌లో కాస్త ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని వేణు స్వామి చెప్పారు.

మొత్తంగా 95 సీట్ల నుంచి 125 సీట్ల వ‌ర‌కు వైసీపీ విజ‌యం సాధించి మ‌రోసారి వైసీపీ అధికారం కైవ‌సం చేసుకుంటుంద‌న్నారు. అంతేనా 2029లో సైతం జ‌గ‌న్ విజ‌యం సాధించి హ్యాట్రిక్ వ‌రుస‌గా మూడో సారి సీఎం అవుతార‌ని చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాలు ఆయ‌న చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. టీడీపీ కూట‌మి క్లీన్ స్వీప్ చేస్తోంది. తాను చెప్పింది త‌ప్పు కావ‌డంతో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

ఏపీ సీఎంగా 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పవన్ తో భేటీ ఎప్పుడంటే?

తన విద్వత్తు.. నాలెడ్జ్ ఉపయోగించి, జాతకాన్ని బేస్ చేసుకుని జగన్ గురించి జ్యోతిష్యం చెప్పానని.. అది 100 శాతం తప్పైందని ఒప్పుకుంటున్నట్లు వేణుస్వామి తెలిపారు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.