Big Fight In AP : ఏపీలో ఆ 30 కీలక నియోజకవర్గాల్లో బిగ్ ఫైట్? ఆ 30 ఏవి? అక్కడ పోటీ ఎలా ఉంది?

దాదాపు అభ్యర్థులంతా ఫైనల్ అవగా, కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 స్థానాల్లో బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Big Fight In AP : ఏపీలో ఆ 30 కీలక నియోజకవర్గాల్లో బిగ్ ఫైట్? ఆ 30 ఏవి? అక్కడ పోటీ ఎలా ఉంది?

Big Fight In 30 Assembly Segments In Andhra Pradesh

Big Fight In Ap : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరో నెల రోజుల్లో జరిగే పోలింగ్ కు పార్టీలు సకల అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. దాదాపు అభ్యర్థులంతా ఫైనల్ అవగా, కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 స్థానాల్లో బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో బిగ్ ఫైట్ జరగనున్న 30 నియోజకవర్గాలు ఏవి? అక్కడ పోటీ ఎలా ఉంది?

ఏపీలో ఎలక్షన్ గేమ్ చాలా ఇంట్రస్టింగ్ గా మారుతోంది. పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకోవడానికి పార్టీలు చాలా ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇప్పటికే రెండు పక్షాలు అభ్యర్థులను ప్రకటించేశాయి. 175 నియోజకవర్గాల జాబితాను ఒకేసారి విడుదల చేసిన అధికార పార్టీ.. ప్రచారంలో దూసుకుపోతోంది. ఇదే సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా దాదాపు 99శాతం అభ్యర్థులను ప్రకటించేశారు. 175 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల పోటీ హైటెన్షన్ గా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరి దృష్టి 30 నియోజకవర్గాలపైనే ఉంది. అక్కడ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరు? ఆయా కీలక స్థానాల్లో గెలుపు ఎవరిది? అనేది ఉత్కంఠగా మారింది.

ఏపీలో హేమాహేమీలు పోటీ పడుతున్న కీలక స్థానాలు, అభ్యర్థులు..

పులివెందుల నియోజకవర్గం
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి
బీటెక్‌ రవీంద్ర, టీడీపీ అభ్యర్థి

కుప్పం నియోజకవర్గం
చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి
భరత్‌, ఎమ్మెల్సీ

టెక్కలి నియోజకవర్గం
అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ

చీపురుపల్లి నియోజకవర్గం
బొత్స సత్యనారాయణ, మంత్రి
కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి

భీమిలి నియోజకవర్గం
అవంతి శ్రీనివాస్‌, మాజీ మంత్రి
గంటా శ్రీనివాస్‌, మాజీ మంత్రి

నర్సీపట్నం నియోజకవర్గం
పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, ఎమ్మెల్యే
అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి

పాయకరావుపేట నియోజకవర్గం
కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే
వంగలపూడి అనిత, తెలుగు మహిళ అధ్యక్షురాలు

రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం
చెల్లుబోయిన వేణు, మంత్రి
బుచ్చయ్యచౌదరి, మాజీ మంత్రి

పిఠాపురం నియోజకవర్గం
వంగా గీత, ఎంపీ
పవన్‌కల్యాణ్‌, జనసేన అధ్యక్షులు

దెందులూరు నియోజకవర్గం
అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే
చింతమనేని ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే

విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గం
షేక్‌ ఆసీఫ్‌, వైసీపీ అభ్యర్థి
సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి

గుడివాడ నియోజకవర్గం
కొడాలి నాని, మాజీ మంత్రి
వెనిగండ్ల రాము, టీడీపీ అభ్యర్థి

గన్నవరం నియోజకవర్గం
వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే
యార్లగడ్డ వెంకటరావు, టీడీపీ అభ్యర్థి

తెనాలి నియోజకవర్గం
అన్నాబత్తుల శివకుమార్‌, ఎమ్మెల్యే
నాదెండ్ల మనోహర్‌, జనసేన పీఏసీ చైర్మన్‌

సత్తెనపల్లి నియోజకవర్గం
అంబటి రాంబాబు, మంత్రి
కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి

ఒంగోలు నియోజకవర్గం
బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి
దామచర్ల జనార్దన్‌, మాజీ ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం
ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే

ఆత్మకూరు నియోజకవర్గం
పుంగనూరు
రాప్తాడు
తాడిపర్తి
ఆళ్లగడ్డ
పాణ్యం
రాయచోటి
జమ్మలమడుగు

Also Read : చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? కుప్పంలో వైసీపీ భారీ వ్యూహం ఏంటి?