Karthika Masam Deepam: కార్తీక మాసంలో వీటితో దీపం ఇలా వెలిగిస్తే.. అద్భుత ఫలితాలు కలుగుతాయి..!
పైడి పత్తితో స్వయంగా ఒత్తులు తయారు చేసుకుని ఆ వత్తులు వేసుకున వెలిగిస్తే చాలా మంచిది.

Karthika Masam Deepam: కార్తీక మాసంలో దీపం ఎలా వెలిగించాలి? దీపం ఎప్పుడు వెలిగించాలి? దీపం ఎప్పుడు ఎలా వెలిగిస్తే కార్తీక మాసంలో అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.. కార్తీక మాసం అంటేనే దీపాలు వెలిగించేటటువంటి మాసం. కార్తీక మాసంలో దీపం ఎలా వెలిగించాలి అంటే.. ప్రధానంగా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె.. ఈ మూడింటితో దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
కార్తీక మాసంలో చాలా మంది రకరకాల నూనెలతో దీపాలు వెలిగిస్తుంటారు. కానీ స్కాంద పురాణం, తులా పురాణం ప్రకారం ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె.. ఈ మూడింటిలో ఏదో ఒక నూనెతో కార్తీక మాసంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
దీపం ఎలా వెలిగించాలి?
* మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవచ్చు.
* లేదా పిండి దీపాలైనా వెలిగించుకోచ్చు.
* పిండి దీపం అంటే బెల్లం తురుము, బియ్యం పండి, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాన్ని తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఇంటి గుమ్మం బయట లేదా శివాలయ ప్రాంగణంలో, విష్ణువు ఆలయ ప్రాంగణంలో కానీ, ఏ దేవి, దేవతల ఆలయ ప్రాంగణంలోనైనా సాయంత్రం పూట దీపాలు వెలిగించుకోవచ్చు.
దీపాలు వెలిగించేటప్పుడు అందులో ఒత్తి ఎలా ఉండాలి.
* పైడి పత్తితో స్వయంగా ఒత్తులు తయారు చేసుకుని ఆ వత్తులు వేసుకున వెలిగిస్తే చాలా మంచిది.
* పైడి పత్తితో చేసిన వత్తులు మాత్రమే వేసి కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి.
* స్కాంద పురాణం, తులా పురాణంలో పైడి పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టాలని చెప్పారు.
దీపాలు ఏ సమయంలో వెలిగించాలి?
* కార్తీక మాసంలో సాయంత్రం చీకటి పడ్డాక వెలిగించాలి.
దేవాలయంలో ఎక్కడ వెలిగించాలి?
* శివాలయంలో అయితే నందీశ్వరుడికి సమీపంలో దీపం వెలిగించాలి. లేదా ధ్వజ స్థంభం దగ్గర అయినా వెలిగించుకోవచ్చు. గర్భగుడిలో వెలిగించగలిగితే ఇంకా అద్భుతం.
* విష్ణువు ఆలయంలో అయినా సరే.. ధ్వజ స్థంభం దగ్గర దీపాలు వెలిగించండి. దాంతో ఎక్కువ ఫలితం ఉంటుంది.
* విష్ణువు ఆలయంలో దీపం పెట్టినప్పుడు అక్కడ ఒక్క అవిస పుష్పం పెట్టినా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.