Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కుటుంబంలో ఇబ్బందులు..!

ఈ రోజు ( 2024, నవంబర్ 24, ఆదివారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు..

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి కుటుంబంలో ఇబ్బందులు..!

Updated On : November 23, 2024 / 8:19 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోదినామ సంవత్సర కార్తీకమాస బహుళ నవమి రా 1:19 పూర్వఫల్గుణ రాత్రి 10:16, ఆదివారము

మేష రాశి: కుటుంబంలో ఇబ్బందులు, అనవసరమైన తగాదాలు, చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోకూడదు, ధనవ్యయము, ప్రయుణములో అలసట, వృత్తి, ఉద్యోగ భంగములు కల్గును, విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి, కోర్టు సమస్యలు పరిష్కారం అవడం. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధనము వలన మేలు కల్గును.

వృషభ రాశి: అన్ని పనులు సకాలంలో కావడం, వృత్తి, వ్యాపార రంగములో అభివృద్ధి, ప్రయాణముల వలన లాభము కలగడం, శుభ కార్యక్రమములు నిర్వహించుట, ప్రతి పనిలో విజయము అన్నింటా లాభము, నూతన వ్యాపారములో విజయం, స్త్రీలు ఉద్యోగం గురించి ఆలోచన చేస్తారు. లలితా స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం జరుగుతుంది.

మిధున రాశి: కుటుంబములోని వారు ఆరోగ్యముగా ఉంటారు. ధనధాన్య సంపదలు, స్త్రీలతో ప్రియ సంభాషణలు చేయటం, ధార్మిక పద్ధతులతో నడుచుకొంటారు. దైవ పుణ్యకార్యములలో చురుకుగా పాల్గొంటారు, పై అధికారుల ఆదరాభిమానములు పొందుతారు. శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం చేసినచో శుభం ఫలితములు పొందుతారు.

కర్కాటక రాశి: మనో వేదనల వలన నిర్ణయమునకు రాలేరు, సంతానం ద్వారా శుభవార్తలు, మనఃశాంతి లోపించండం, ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లడం, అన్నింటా విజయం, నూతన వ్యాపారములు ప్రారభించవచ్చు, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసినా మేలు కల్గును.

సింహ రాశి: స్వస్థానములో మేలు జరుగును, ధనధాన్య లాభములు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగును, సంఘంలో అన్యస్త్రీ పరిచయ భాగ్యములు, పనిని సమర్థవంతముగా నిర్వహిస్తారు, ప్రయాణముల వల్ల లాభములు కలుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనవల్ల మేలు కలుగును.

కన్యా రాశి: భార్యాభర్తల మధ్య విభేదములు, ప్రయాణముల వలన లాభములు, వాహనములు కొనుగోలు చేయడం, దూరపు ప్రయాణములు చేయడం, వస్తువులు అమ్మకాలు, కొనుగోలు చేయడం, తీర్ధయాత్రలు, విద్యార్థులకు అనుకూలము, విందు వినోదములు మాటపట్టింపు ధోరణి, బంధు మిత్రులతో వివాదములు, అనారోగ్యము కలగడం, తల్లికి అనారోగ్యము. శివ ఆరాధన వలన శుభం కలుగుతుంది.

తులా రాశి: ప్రయాణములు చేయడం, ఆకస్మిక ధనలాభం, అనుకున్న పనులు నెరవేరడం, విలువైన వస్తువులు కొనడం, రహస్య విషయములు, అనారోగ్యం, వివాహాది శుభకార్యక్రమములు చేయడం, కోపము, ఆవేశము కలగడం, విద్యపట్ల ఆసక్తి. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి: ఉద్యోగ భద్రత, విపరీతమైన ఆలోచనలు, శుభకార్య నిర్వహణ, ప్రయాణముల వలన లాభములు, వ్యాపారములో లాభములు, విదేశాలకు వెళ్లడం, ప్రమోషన్ల గృహ మరమ్మత్తులు, వాహనములు కొనడం, సరియైన నిర్ణయములు తీసుకోవాలి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన వలన శుభం కలుగుతుంది.

ధనస్సు రాశి: ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. అన్నదమ్ములు, అక్కా చెల్లెల్ల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది, భార్య భర్త ల మధ్య అనుబంధం పెరగడం, ఉద్యోగ వ్యాపారములలో లాభములు, నూతన వస్త్రప్రాప్తి, విలువైన ఆభరణములు పెరగడం, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల ఉత్తమ ఫలితములు వస్తాయి.

మకర రాశి: ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, మీ భాగస్వామితో అన్ని విషయములు పంచుకుంటారు, నేడు ఏ పని చేసిన విజయం సాధిస్తారు- గణపతిని గకార అష్టోత్తరతో పూజ చేసిన శుభ ఫలితములు కలుగును.

కుంభ రాశి: వృత్తి ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు మినహా శుభంగా ఉంటుంది, ఈ రోజు మానసిక ఆందోళనలు, అధికారుల ఒత్తిడి కలగడం, భాగస్వామ్య వ్యాపారంలో సమస్యలు, ధనలాభం, కోర్టు సమస్యల్లో పరిష్కరములు కనబడటం, తీర్థయాత్రలు, ప్రయాణముల వలన లాభములు, అన్నింటా విజయ సూచనలు, శుభకార్యక్రమములలో పాల్గొనడం సంతోషం శాంతి కలుగుతుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన ఉత్తమము.

మీన రాశి: ఈ రోజు విశేషంగా యోగిస్తుంది, వ్యాపారము-ఉద్యోగములలో ఆర్ధిక లాభములు, అన్ని రంగాల వారికి ఈ రోజు లక్ష్మీ కటాక్షంతో ఆర్ధికలాభములు, పనిలో విజయ పరంపరలుగా ఉంటాయి, ఆరోగ్యం సహకరిస్తుంది, ఈ రోజంతా ప్రశాంతంగా గడిచి పోతుంది, ఆకస్మిక ధనలాభము కలుగుతుంది, సహనంతో ఉంటే అన్ని శుభములు జరుగుతాయి. శ్రీ కనకధార స్తోత్రము పారాయణము చేయటం వల్ల శుభం కలుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956