Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఉద్యోగపరంగా శుభ యోగం కలుగును ..!

ఈ రోజు (సోమవారం, అక్టోబర్ 7, 2024న) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఉద్యోగపరంగా శుభ యోగం కలుగును ..!

Updated On : October 6, 2024 / 12:36 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వయుజ మాస శుద్ధ చవితి ఉ 9:47, అనురాధ రాతె 2:25, సోమవారము ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు 

మేష రాశి: దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్త గా ఉండాలి, అకాల భోజనం, మోకాళ్ళ నొప్పులు, వ్యాపారంలో లాభములు, ప్రయాణములు, ఉద్యోగంలో చిన్నచిన్న ఇబ్బందులు, ధనమును పోదుపు చేసుకోవాలి, ఖర్చులు పెంచుకోకూడదు, ఆకారణ వైరము: సూర్యనమస్కారములు చేయడం వల్ల మంచి జరుగుతుంది.

వృషభ రాశి: సకల కార్యసిద్ధి, అన్నింటా అభివృద్ధి, మానసికానందం, గౌరవం, అభివృద్ధి, కీర్తి, సమస్త భోగభాగ్యాలు లభించడం, ధనాదాయం బాగా ఉండడం, శరీర సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం కలిగి విశేష సౌఖ్యదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, రుద్రజపము చేయవలెను, ఉత్తమ ఫలితములు కలుగును.

మిథున రాశి: కుటుంబ జీవితంలో సౌఖ్యం, శరీర ఆరోగ్యం, ధనలాభం, కీర్తి ఆనందం, స్త్రీ సౌఖ్యం, పరోపకారాలు, దైవపుణ్య కార్యములలో చురుకుగా పాల్గొంటారు. విద్యావంతులకు గౌరవసన్మానములు పొందుదురు, వ్యాపార విస్తరణ, విధ్యార్ధులకు అనుకూలము : శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: బంధుమిత్రులతో గొడవలు, కోర్టు సమస్యలు, ప్రతివిషయంలో జాగ్రత్త అవసరం, ఉద్యోగంలో చిక్కులు, ఆలస్యము, నూతన వ్యాపారములలో ఆందోళన, భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదములు, మధ్యవర్తిత్వంలో చిక్కులు, రోగములు, మృత్యుంజయ జపము చేసుకున్నచో శుభ ఫలితములు జరుగుతాయి.

సింహ రాశి: నిరాశ, పనులలో ఆలస్యం, మనశాంతి లేకపోవడం, నూతన ఉద్యోగములు, వ్యాపారంలో లాభములు, స్త్రీ సుఖం, విధ్యార్థులకు అనుకూలం, వ్యాపారంలో లాభములు, ప్రయాణంలో ఆటంకములు, ఇష్ట ఆరాధన వలన అనుకున్న పనులు అవుతాయి 

కన్యా రాశి: వ్యాపారంలో లాభములు, ఉద్యోగంలో అభివృద్ధి, ఆభరణ లాభం, వాహనములు కొనుగోలు చేయడం, కార్యముల యందు విజయం, ఇష్ట స్త్రీ సంగమం, వస్త్ర లాభం, మనోధైర్యం, విదేశాలకు వెళ్లడం, విహహాది శుభకార్యములలో పాల్గోనటం, విష్ణు సహస్ర పారాయణం చేయడం వల్ల అనుకూలమైన ఫలితములు కలుగుతాయి.

తులా రాశి: మనోవిచారం, ధన పరంగా పొదుపు అవసరం, అనారోగ్యం, మానసిక బాధ, అకాల భోజనా కార్యలలో ప్రతికూలత, ధననష్టం, అజీర్ల బాధలు, నరాల బలహీనత, నిద్రలేమి అకారణ వైరము, స్థానచలనం, కార్యరంగంలో ప్రతికూలత: లలితా సహస్ర నామపారాయణం వలన ఉత్తమ ఫలితములు వస్తాయి.

వృశ్చిక రాశి: సమాజంలో గౌరవం, సుఖ నిద్ర, భోజన సౌఖ్యము, ఆభరణ ప్రాప్తి, విలువైన ఆభరణాలు కొనడం, వ్యాపారంలో లాభములు, స్థానచలనం, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, మహనీయుల కలయిక, వ్యాపారవృద్ధి, సుఖసంతోషాలు, శారీరక సౌఖ్యం: ఆంజనేయస్వామి ఆరాధన వలన ఉత్తమ ఫలితము లు కలుగుతాయి.

ధనస్సు రాశి: అనవసరపు విషయాల మీద దృష్టి పెట్టి గొడవలు కలగడం, శారీరక శ్రమ, శతృవృద్ధి, కోర్టు సమస్యలు, భార్య భర్తల మధ్య చిక్కులు, అకాలన భోజనం, వ్యాపారంలో తగాదలు, ఉద్యోగంలో అనుకులత, ధనలాభం, విలువైన ఆభరణములు కోనడం, స్థానచలనము: గణపతి కి ‘గ’ కార అష్టోత్తరముతో పూజ చేసిన మంచి ఫలితములు కలుగుతాయి

మకర రాశి: బంధు గృహాలలో సుఖభోజనం, ధన లాభం, ధాన్య సమృద్ధి, ఆనందం, వ్యాపారంలో మంచిలాభాలు, నూతన వ్యాపారములు కలిసి రావడం, ఉద్యోగంలో ఆదాయం పెరగడం, వివాహసంబంధములు కుదరడం. సంతానం ద్వారా శుభవార్తలు వినడం, ప్రయాణములు, తీర్థయాత్రలు: శ్రీ కృష్ణ మంత్ర జపము వలన శుభఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి:ప్రయత్న కార్య జయము, ఆరోగ్యము, బంధుప్రీతి, ఇష్టకార్యసిద్ధి, ప్రతి పనిలో సానుకూలత, శుభకార్య నిర్వహణ, ఉద్యోగంలో అభివృద్ధి, శుభవార్త శ్రవణం, కార్యసిద్ధి, ధనలాభము, స్త్రీలకు అనుకూలము, విధ్యార్థులకు విద్యలో విజయం కలుగును.. గౌరి పూజ చేయడం వలన శుభ ఫలితములు కలుగుతాయి.

మీనా రాశి: కుటుంబంలో కలహాలు, సంతానంతో విరోధం, అనారోగ్యం, ఉద్యోగ భంగము, వ్యాపారంలో అనుకూలత, విదేశాలకు వెళ్లడం, రుణాలు లభించడం, ఇంటి నిర్మాణము, విద్యార్థులకు విద్యలో ఆటంకములు, ఉద్యోగంలో లాభములు, గౌరవ మర్యాదలు లభించడం, పనులలో సానుకూలత, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి: దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి ఫలితములు కలుగుతాయి.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956