చతుర్భుజాలతో దర్శనమిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి.. తెల్లని కలువలతో పూజిస్తే..
శ్రీ మహాలక్ష్మీ దేవికి క్షీరాన్నాన్ని (పాయసం) నైవేద్యంగా సమర్పిస్తారు.

Devi Navaratrulu 2025
Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారిని పూజిస్తే సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం దక్కుతాయని చెబుతారు. మహాలక్ష్మీ దేవిగా అలంకరించిన అమ్మవారు చతుర్భుజాలతో భక్తులకు దర్శనమిస్తారు.
అమ్మవారి ఒక హస్తంలో అభయ ముద్ర, రెండు హస్తాలలో కమలాలు, మరో హస్తంతో కనకధారను ఉంటాయి. అమ్మవారి ఇరువైపులా గజరాజులు ఉంటారు. శ్రీ మహాలక్ష్మీ దేవికి క్షీరాన్నాన్ని (పాయసం) నైవేద్యంగా సమర్పిస్తారు.
మహాలక్ష్మీ దేవిని పూజిస్తే శ్రేయస్సు, సమృద్ధి, లభిస్తుందని నమ్మకం. అలాగే, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారిని తెల్లని కలువలతో పూజిస్తే మంచిది. దక్షిణ దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. (Devi Navaratrulu 2025)
శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సంపద, హోదా కలుగుతాయని పండితులు చెబుతారు. నవరాత్రుల్లోనే కాకుండా శ్రావణ మాసంలో శుక్రవారం రోజు కూడా తామర పూవులతో అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో లక్ష్మీ సహస్రం, శ్రీసూక్తం చదవాలి.
‘ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లక్ష్మీదేవి యంత్రాన్ని పూజించినా, స్త్రోత్రాలు పఠించినా ఫలితాలు కలుగుతాయి.
Note: ఈ వివరాలు పాఠకులకు అవగాహన కోసం మాత్రమే రాశాం. వీటిని శాస్త్రాల్లో, పలువురు నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా ఇస్తున్నాము.