Shani Trayodashi: అక్టోబర్ 4.. శనిత్రయోదశి, గోవత్స ద్వాదశి.. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి..!

ఓం సురబ్యై నమ: అనే మంత్రాన్ని వీలైన్నని సార్లు చదవండి. 108 లేదా 54 లేదా 21 సార్లు.

Shani Trayodashi: అక్టోబర్ 4.. శనిత్రయోదశి, గోవత్స ద్వాదశి.. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి..!

Updated On : October 4, 2025 / 1:26 AM IST

Shani Trayodashi: అక్టోబర్ 4.. శనిత్రయోదశి, గోవత్స ద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధానాలు పాటిస్తే శని దోషాలు తొలగించుకుని సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో పండితుల మాటల్లో తెలుసుకుందాం..

అక్టోబర్ 4వ తేదీ శనివారం.. త్రయోదశితో కలిసి వచ్చింది. దీన్ని శనిత్రయోదశి అంటారు. అలాగే ఈరోజు ఆశ్వీయుజ శుక్ల పక్ష ద్వాదశి కూడా ఉంది. కాబట్టి దీన్ని గోవత్స ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. అక్టోబర్ 4 శనివారం ఉదయం పూట ద్వాదశి ఉంది. కాబట్టి ఆశ్వీయుజ శుక్ల ద్వాదశి గోవత్స ద్వాదశి అంటారు. సాయంకాలం పూట త్రయోదశి ఉంది. శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి శనిత్రయోదశి అంటారు. శనిత్రయోదశి ప్రదోష కాలంలో ఉంది.

చీకటి పడక ముందే తైలాభిషేకం చేయాలి..

శని పూజలు చేయాలి అనుకున్న వాళ్లు అక్టోబర్ 4 శనివారం సాయంత్రం శని పూజలు చేయాలి. చీకటి పడక ముందే నవగ్రహ ప్రదక్షణలు చేసుకోవాలి, చీకటి పడక ముందే నవగ్రహాల్లో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవాలి. అలాగే నవగ్రహ ప్రదక్షణలు చేస్తూ నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. ఓం శం శనైశ్చరాయ నమ: అనే మంత్రం చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షణలు చేసినా అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం చీకటి పడే లోపు చేయాలి.

అలాగే అక్టోబర్ 4 గోవత్స ద్వాదశి అన్నారు. వత్స అంటే దూడ అని అర్థం. దూడతో కలుసున్న ఆవుని పూజించే రోజు అని అర్థం. మీకు దగ్గరలో గోశాల ఉంటే అందులో ఆవు, దూడ ఉన్నట్లైతే ఆ రెండింటికి కలిపి ప్రదక్షణలు చేయాలి. ఆవుకి, దూడకి రెండింటికీ ఆహారం తినిపించండి. దాని వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. మీకు దగ్గరలో గోశాల లేదు, ఆవే దూడ లేవు.. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే గోవత్స ద్వాదశి రోజు ఇంట్లోనే ఆవు దూడ ఉన్న బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి.

ఆ ఫోటోకి కానీ విగ్రహానికి కానీ బొట్లు పెట్టి, దీపం పెట్టాలి. ఓం సురబ్యై నమ: అనే మంత్రాన్ని వీలైన్నని సార్లు చదవండి. 108 లేదా 54 లేదా 21 సార్లు. ఆవు దూడ ఉన్న బొమ్మకి లేదా విగ్రహానికి పూలతో పూజ చేసి కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టింది.

శనిత్రయోదశి సందర్భంగా నవగ్రహ ప్రదక్షణలతో పాటుగా శని దానం ఇచ్చుకుంటే మంచింది. కేజీ పావు కేజీ నల్ల నువ్వులు, ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసరపెప్పు, నువ్వులు వీటన్నింటిని నల్లటి వస్త్రంలో మూట కట్టి శనివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో దానం ఇవ్వాలి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. జాతక శని దోషాలు, రాశిపరమైన శనిదోషాలు తొలగిపోతాయి. ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకోవాలి. నల్ల నువ్వులు కలిపి పాలతో కానీ నల్ల నువ్వులతో కలిపిన నీళ్లతో కానీ శివాభిషేకం చేసుకోవాలి. శని దోషాలు తొలగిపోయి శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి.

Also Read: వివిధ రకాల కాలసర్పయోగములు ఇవే.. వాటి ఫలితాలను తట్టుకోలేరు..