Karthika Masam: కార్తీక మాసం.. 23వ రోజు.. ఇలా చేస్తే ఆఖండ ఐశ్వర్య ప్రాప్తి ఖాయం..!
Karthika Masam: కార్తీక మాసం.. 23వ రోజు.. నవంబర్ 13.. ఎలాంటి ప్రత్యేక విధివిధానాలు పాటిస్తే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చో, ఆదాయ మార్గాలు పెరుగుతాయో, అలాగే కార్తీక మాసంలో 23వ రోజు ఏ కథ వినటం ద్వారా అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయో.. కార్తీక మాసంలో 23వ రోజు నవంబర్ 13 గురువారం వచ్చింది కాబట్టి రావి ఆకుకు సంబంధించిన ఎలాంటి శక్తిమంతమైన పరిహారం చేసుకుంటే మీ మనసులో ఉన్న కోరిక 41 రోజుల్లో నెరవేరుతుందో తెలుసుకుందాం..
కార్తీక మాసం 23వ రోజున అందరూ ప్రత్యేక దానం ఇవ్వాలి. ఆ దానం ఆర్థికంగా అత్యున్నత స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో నర్మదా బాణ లింగము, సాలగ్రామము.. ఈ రెండింటినీ కూడా అర్చకులకు దానం ఇవ్వాలి. ధర్మరాజులాగే మీరు కూడా అద్భుతమైన రాజ వైభవాన్ని పొందుతారు. అదీ కార్తీక మాసంలో 23వ రోజుకున్న ప్రాధాన్యత.
తులసి కోటలో పసుపుపచ్చ చామంతి పూలు ఉంచి నమస్కారం చేసుకుంటే కూడా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింప జేసుకోవచ్చు. జీవితంలో ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. పోగొట్టుకున్న ధన, కనక, వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింజేసుకోవాలన్నా.. పోయిన రాజ వైభవం తిరిగి రావాలన్నా.. కార్తీక మాసం 23వ రోజున 108 తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించండి. అంటే లక్ష్మీనారాయనుల ఫోటో, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి.. ఇలా విష్ణు సంబంధమైర ఫోటోకి 23వ రోజు 108 తులసి దళాలతో పూజ చేసి ఆ తర్వాత ఆలయంలో స్వయం పాకం చేత్తో దానం ఇవ్వాలి. అంతే.. సూంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం, రాజ వైభవం కలుగుతుంది. అలాగే 23వ రోజున స్నానం చేసేటప్పుడు ఒక ఉసిరిక ఆకు లేదా కాయ, జిల్లేడు ఆకు తల మీద పెట్టుకుని స్నానం చేయాలి. జన్మజన్మల పాపాలను తొలగింపజేసుకుని సమస్త శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు.
