అక్టోబర్ 24.. కార్తీక మాసం 3వ రోజు.. ఇలాచేస్తే చాలు.. మీ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయ్.. దరిద్రానికి ఇక సెలవ్‌..

జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు ఈ విధి విధానాలను పాటించాలి.

అక్టోబర్ 24.. కార్తీక మాసం 3వ రోజు.. ఇలాచేస్తే చాలు.. మీ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయ్.. దరిద్రానికి ఇక సెలవ్‌..

Updated On : October 23, 2025 / 1:11 PM IST

Karthika Masam: కార్తీక మాసంలో మూడో రోజు అక్టోబర్ 24 (శుక్రవారం). కార్తీక మాసంలో మూడో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకోరుతాయో తెలుసుకుందాం. అలాగే, జన్మ జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి, పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండటానికి కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు పాటించాల్సిన విధి విధానాలు ఏంటో చూద్దాం.

త్రిలోచన గౌరీ వ్రతం

కార్తీక మాసంలో మూడో రోజు త్రిలోచన గౌరీ వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించలేని వాళ్లు దానికి ప్రత్యామ్నాయంగా గౌరీ పూజను నిర్వహించుకోండి.

గౌరీ పూజ ఎలా చేయాలంటే ఒక తమలపాకులో పసుపు ముద్ద ఉంచి పూజ గదిలో పై భాగంలో ఎడమ వైపు, కుడి వైపు కుంకు కుంకుమ బొట్లు పెట్టి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి. ఓం హరిద్ర కుంకుమ ఆరాధ్యాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి.

Also Read: అందుకే ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది: వైఎస్ జగన్ సంచలన కామెంట్స్‌

బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల వివాహ, దాంపత్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలో మూడో రోజు ఎవరైనా సరే శివాలయానికి లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లాలి.

రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లొచ్చు లేదా శివాలయానికి వెళ్లొచ్చు. వెళ్లేటప్పుడు ఎర్రటి మందార పూలు ఎర్ర గులాబీ పూలు తీసుకొని వెళ్లండి.

ఎర్ర మందార పూలు, ఎర్ర గులాబీ పూలు దేవాలయంలో శివుడికి కానీ విష్ణువుకు కానీ సమర్పించండి. దేవాలయానికి వెళ్లలేని వాళ్లు ఇంట్లో అయినా సరే ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో శివకేశవులను పూజించండి.

దేవాలయానికి వెళితే అర్చకులకు ఇచ్చి స్వామికి సమర్పించమని చెప్పండి. ఆ తర్వాత శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఆలయంలో ఆవునెయ్యి ప్యాకెట్ ఎవరికైనా దానం ఇవ్వండి.

ఇలా చేస్తే కార్తీక మాసంలో మూడో రోజు ఈ పూజా ఫలితాన్ని ఎవరికైనా ధారపోసే శక్తి కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే మనం కార్తీక మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే ఈ ఫలితాన్ని మనం ఎవరికైనా ధారపోయవచ్చు.

తల్లిదండ్రులు అయితే పిల్లలకు ధారపోయండి. అక్టోబర్ 24 శుక్రవారం కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆలయానికి వెళ్లి ఇలా ఎర్రపూలు శివుడికి గాని, విష్ణువుకి గాని సమర్పించి ఆలయ ప్రాంగణంలో ఆవునెయ్యి దీపం పెట్టి ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇవ్వాలి.

ఆ తర్వాత ఇంటికి వచ్చి దోసిట్లో నీళ్లు తీసుకొని తులసికోటలో ఆ నీళ్లు పోస్తూ “ఈరోజు పూజా ఫలితాన్ని నా పిల్లలకి ధార పోస్తున్నాను” అనుకోండి. అలా చేస్తే ఆ పూజా ఫలితం వల్ల పిల్లలు జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు ఈ విధి విధానాలను పాటించాలి.

Note: ఈ కథనం.. విశ్వాసాలు, సంప్రదాయ పద్ధతులకు సంబంధించిన వివరణ మాత్రమే. వీటిపై నిర్ణయాలను అర్హులైన వారిని సంప్రదించి తీసుకోవాలి. ఇటువంటివి ప్రాంతీయ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. ఈ కథనంలో ఉన్న విషయాల గురించి శాస్త్రీయ నిర్ధారణ లేదు.