Chiluku Dwadasi: నవంబర్ 2.. ఆదివారం.. చిలుకు ద్వాదశి.. తులసి కోట దగ్గర ఈ దీపం వెలిగిస్తే డబ్బే డబ్బు..!

బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించుకోవచ్చు.

Chiluku Dwadasi: నవంబర్ 2.. ఆదివారం.. చిలుకు ద్వాదశి.. తులసి కోట దగ్గర ఈ దీపం వెలిగిస్తే డబ్బే డబ్బు..!

Updated On : November 1, 2025 / 11:23 PM IST

Chiluku Dwadasi: నవంబర్ 2.. ఆదివారం.. చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి.. ఈ సందర్భంగా సర్వ సంపదలు కలగాలంటే జన్మజన్మల దరిద్రాలన్నీ పొగొట్టుకోవాలంటే, అష్ట ఐశ్వర్యాలు లభించాలంటే ఎలాంటి విధివిధానాలు పాటించాలో తెలుసుకుందాం..

కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే.. దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలికింది ఆరోజే కాబట్టి చిలుకు ద్వాదశి అంటారు. ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలన్నా, ఆదాయం పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా, ఈ చిలుకు ద్వాదశి రోజున దేవాలయం ప్రాంగణంలో పెరుగన్నం దానం ఇవ్వాలి అని కార్తీక పురాణం చెబుతోంది. పెరుగన్నం దానం ఇస్తే ఆర్థికంగా బాగా కలిసివస్తుంది.

ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. నవంబర్ 1న ఉత్తాన ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేలుకున్న శ్రీమహా విష్ణువు నవంబర్ 2న క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి బృందావనానికి వచ్చి తులసి మాతను వివాహం చేసుకున్న రోజు. అందుకే దేవాలయాల్లో తులసీ దామోదరుల కల్యాణం చేస్తారు. ఆ కల్యాణం దర్శించినా, కల్యాణం అక్షింతలు ధరించినా వివాహ పరమైన సమస్యలు తొలగిపోతాయి.

ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఆడవాళ్లందరూ చిలుకు ద్వాదశి రోజున ప్రత్యేకమైన ముగ్గులు వేసి, ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. బియ్యం పిండితో శంఖం ముగ్గు, చక్రం ముగ్గు, పద్మం ముగ్గు, స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయాలి. ఈ నాలుగు ముగ్గులు తులసికోట దగ్గర వేయాలి. ఏ ఇంట్లో ఆడవాళ్లైతే నవంబర్ 2న చిలుకు ద్వాదశి రోజున ఇంటి ఆవరణలో ఈ ముగ్గులు వేస్తారో వాళ్ల ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంవత్సరం పాటు ఉంటుది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు.

అలాగే చిలుకు ద్వాదశి రోజున తులసి కోట దగ్గర ఉసిరక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అంటే ఉసిరికాయపైన పెచ్చు తీసేసి ఆవు నెయ్యిలో తడిపిన పువ్వొత్తి వేసి దీపాలు పెడతారు. వీటిని ఉసిరిక దీపాలు అంటారు. లేదా బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించుకోవచ్చు. ఉసిరిక దీపం లేదా పిండి దీపం తులసి కోట దగ్గర వెలిగిస్తే సమస్త సంపదలు సిద్ధింప జేస్తుంది.