Gupt Navratri 2025 : గుప్త నవరాత్రులు విశిష్టత.. పూజా విధానం ఏంటి? ఈ 9 రోజులు అమ్మవారిని ఏయే రూపాల్లో ఆరాధించాలంటే?

Gupt Navratri 2025 : రాజశ్యామల గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత గురించి తెలుసా? అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది? 9 నవరాత్రుల సమయంలో ఏయే రూపాల్లో ఆరాధించాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం.

Gupt Navratri 2025 : గుప్త నవరాత్రులు విశిష్టత.. పూజా విధానం ఏంటి? ఈ 9 రోజులు అమ్మవారిని ఏయే రూపాల్లో ఆరాధించాలంటే?

Magha Gupta Navratri 2025

Updated On : January 30, 2025 / 6:52 PM IST

Gupt Navratri 2025 : మాఘ గుప్త నవరాత్రులు.. హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగలలో ఒకటి. దుర్గా దేవి ఆరాధనకు ప్రసిద్ధి. ఈ ఆచారానికి అత్యున్నత శక్తి అయిన అమ్మవారి ఆవాహనకు ప్రతీకగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. తెలుగు పంచాంగంలో ప్రతి ఏడాది నవరాత్రులు 4 సార్లు వస్తాయి.

అందులో ఛైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అలాగే, ఆంగ్ల సంవత్సరంలో తొలి గుప్త నవరాత్రులు వచ్చాయి. రెండో గుప్త నవరాత్రులు అనేవి ఆషాఢ మాసంలోనే వస్తాయి. ఈ నవరాత్రుల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈ నవరాత్రుల సమయంలో గుప్తంగా పూజలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చునని నమ్ముతారు.

Read Also : Maha Kumba Mela 2025 : కుంభమేళా వెళ్లలేకపోయారా?.. మీకూ పుణ్యఫలం దక్కాలంటే.. ఈ రకంగా చేయండి..!

2025 ఏడాదిలో మాఘ గుప్త నవరాత్రులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 07 వరకు జరుగుతాయి. ఇంతకీ రాజశ్యామల గుప్త నవరాత్రుల ప్రాముఖ్యతలేంటి.. అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది? 9 నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఏయే రూపాల్లో పూజిస్తారు అనే పూర్తి విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మాఘ గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత :
మాఘ గుప్త నవరాత్రులు హిందువులకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సూచిస్తుంది. శక్తి, రక్షణను సూచించే దుర్గాదేవి ఆరాధన, తపస్సు వంటివి ఉంటాయి. భక్తులు అడ్డంకులను అధిగమించడానికి, జ్ఞానాన్ని పొందేందుకు, శ్రేయస్సు కోసం అమ్మవారి ఆశీర్వాదాలను కోరుకునే సమయంగా చెప్పవచ్చు.

ఒక పవిత్ర కలశం ఉంచడం ద్వారా దుర్గాదేవిని ఆవాహన చేసే ఆచారంగా చెబుతారు. నవరాత్రి ఆరాధనలో ఈ ఆచారాన్ని సరైన సమయంలో ఆచరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మాఘ గుప్త నవరాత్రులను ఘనంగా జరుపుకుంటుంటారు.

గుప్త నవరాత్రుల్లోని అమ్మవారి 9 అలంకార రూపాలివే :

జనవరి 30 : మొదటి రోజున కాళికా దేవి అవతారం
జనవరి 31 : రెండో రోజున త్రిపుర (శైలపుత్రి) తారా దేవి
ఫిబ్రవరి 1 : మూడో రోజున సుందరీ (బ్రహ్మచారిని) దేవి
ఫిబ్రవరి 2 : నాలుగో రోజున భువనేశ్వరి (చంద్రఘంట) దేవి
ఫిబ్రవరి 3 : ఐదో రోజున మాతా చిత్రమాతా (కుష్మాండ) త్రిపుర దేవి
ఫిబ్రవరి 4 : ఆరవ రోజున భైరవి (స్కంద మాత) దేవి
ఫిబ్రవరి 5 : ఏడో రోజున మధుమతి (శక్తి) దేవి
ఫిబ్రవరి 6 : ఎనిమిదో రోజున మాతా (కాత్యాయని) బాగళాముఖి దేవి
ఫిబ్రవరి 7 : తొమ్మిదవ రోజున మాతంగి (మహాగౌరి) కమలాదేవి

పూజ విధివిధానం :
ఘటస్థాపనకు సంబంధించిన పూజా విధి అత్యంత భక్తితో నిర్వహించాలి. మాఘ గుప్త నవరాత్రుల సమయంలో ఘటస్థాపన పూజకు సంబంధించి ఈ కింది దశలను తప్పనిసరిగా పాటించాలి.

పూజ ప్రాంతాన్ని శుభ్రపరచండి :
పూజ జరిగే ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత ప్రారంభించండి. పవిత్రతను కాపాడుకోవడానికి ఇది ముఖ్యమైనదిగా చెబుతారు.

కలశాన్ని సిద్ధం చేయండి :
కలశాన్ని తీసుకొని శుభ్రమైన నీటితో నింపండి. కలశం పైన కొన్ని మామిడి ఆకులను వేసి కొబ్బరికాయతో కప్పండి. కలశాన్ని శుభ్రమైన గుడ్డ లేదా చెక్కపై ఉంచాలి.

కలశాన్ని ఈ దిశలో ఉంచండి :
కలశాన్ని పూజా ప్రాంతానికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇది దుర్గా దేవి దైవిక ఉనికిని సూచిస్తుంది.

ప్రార్థనలు, మంత్రాలను జపించండి :
జీవితంలో అడ్డంకులను తొలగించడానికి గణేష్ వందన పఠించడం ద్వారా ప్రారంభించండి. ఆ తరువాత, దేవత ఆశీర్వాదం కోసం దుర్గా అష్టాక్షరీ మంత్రం జపించండి.

పూలు, పండ్లను సమర్పించండి :
కలశానికి తాజా పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుడు, బియ్యం వంటి ఇతర వస్తువులను సమర్పించండి. పూజ సమయంలో పూలు అనేవి పవిత్రమైన సమర్పణలుగా చెప్పవచ్చు.

దీపం వెలిగించండి :
కలశం ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇది చీకటిపై కాంతి విజయాన్ని, చెడుపై మంచిని సూచిస్తుంది.

Read Also : RajaShyamala Deeksha : ఈ నెల 30 నుంచే శ్రీరాజశ్యామల నవరాత్రులు.. రాజశ్యామల దీక్ష ఎలా చేయాలి.. ఎప్పుడు స్వీకరించాలి? ఏ మాలను వేసుకోవాలంటే?

దుర్గా సప్తశతి లేదా నవరాత్రి స్తోత్రాన్ని పఠించండి :
దుర్గా సప్తశతి (దుర్గా దేవిని స్తుతిస్తూ 700 శ్లోకాల సమాహారం) లేదా నవరాత్రి స్తోత్రాన్ని 9 రోజులలో అమ్మవారి ఆశీర్వాదం కోసం పఠించండి.

తొమ్మిది రోజుల పాటు ప్రార్థనలు చేయండి :
మీ జీవితంలోని అడ్డంకులను తొలగించేందుకు అమ్మవారిని ప్రార్థించడం ద్వారా ఈ ఆచారాన్ని ముగించండి. తొమ్మిది రోజులు నవరాత్రి ఉపవాసం, ఆచారాలను క్రమంతప్పకుండా పాటించండి.

నవరాత్రి సమయంలో ఉపవాసం, ఆరాధన :
మాఘ గుప్త నవరాత్రుల 9 రోజులలో, భక్తులు ఉపవాసాలను ఆచరిస్తారు. దుర్గాదేవికి రోజువారీ ప్రార్థనలు చేస్తారు. ఉపవాసం చేసే వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి పూర్తి లేదా పాక్షికంగా ఉంటుంది. భక్తులు తమ ఇళ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పండుగ సందర్భంగా సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతారు.

హారతితో ముగింపు :
దుర్గామాత హారతితో పూజను ముగించండి. ఆరతి పాడి దేవత దైవిక శక్తిని స్మరించుకోండి.