Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయంలో కీలక మార్పులు..! ఇక నుండి..
ప్రస్తుత విధానంతో శ్రీవాణి టికెట్ తో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు సుమారుగా 3 రోజుల సమయం పట్టేది.

Tirumala: తిరుమల శ్రీవాణి దర్శనం సమయంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. ఇక నుండి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఆగస్టు 1 నుండి 15 వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది టీటీడీ. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్ లైన్ లో పొంది శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది టీటీడీ. శ్రీవాణి పథకంలో దర్శనానికి టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.10 వేలు.
ప్రస్తుత విధానంతో శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా 3 రోజుల సమయం పట్టేది. తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఆఫ్ లైన్ లో టికెట్లు జారీ చేస్తున్నారు. టికెట్లు పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు రిపోర్టింగ్ సమయం ఇచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్లు కోటా ఉన్నంతవరకు జారీ చేస్తారు.
యథావిధిగా తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు ఇవ్వనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేయనునున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31 వరకు ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతి ఇచ్చారు.
నవంబర్ 1 నుండి నుండి ఆఫ్ లైన్, ఆన్ లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకుని ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ కౌంటర్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచించింది. నూతన విధానంతో భక్తులు శీఘ్రంగా అంటే వచ్చిన రోజే దర్శనం చేసుకునే వెసులుబాటుని గ్రహించగలరని టీటీడీ తెలిపింది.
Also Read: ఉద్యోగాల ఊచకోత.. మొన్న టీసీఎస్ 12వేల మంది, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 15000.. ఇంకా..