Vrishabha Rashi Ugadi Rasi Phalalu 2025 : వృషభ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఉంటాయి.

Taurus
Vrishabha Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.
వృషభం
కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5
రాజపూజ్యం: 1 అవమానం: 3
చైత్రం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒడుదొడు-కులు ఉంటాయి. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులు, ఆత్మీ-యులతో పనులు నెరవేరుతాయి.
వైశాఖం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్త-వుతాయి. ఆదాయం క్రమేపి పెరుగుతుంది. ఇంటా, బయటా సంతోషంగా ఉంటారు. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి.
జ్యేష్ఠం: ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి, స్థానచలనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు.
ఆషాఢం: ఈ మాసంలో పరిస్థితులు మారుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకో-వాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడ-తారు. వివాదాలకు దూరంగా ఉండాలి.
శ్రావణం: శుభకార్యాలు వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరం. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. భూములు, వాహన-ముల మూలంగా ఖర్చులు పెరుగుతాయి.
భాద్రపదం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరాలకు డబ్బు అందు-తుంది. ప్రయాణాల వల్ల అలసట, ఇబ్బంది ఎదురువుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి.
ఆశ్వయుజం: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అన్నదమ్ములు, బంధుమిత్రులతో చికాకులు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కార్తికం: గతంతో పోలిస్తే అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మార్గశిరం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం. పై అధికారులతో స్నేహంగా మెలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది.
పుష్యం: ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. బంధుమిత్రులతో వైషమ్యాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
మాఘం: వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నెల చివరిలో అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ తగ్గుతుంది.
ఫాల్గుణం: ఈ నెల అనుకూలం. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నద-మ్ములు, బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. అనుకున్న పనులు నెరవేరు-తాయి. మంచివారితో స్నేహం కుదురుతుంది.