Vasant Panchami 2025 : వసంత పంచమి రోజున ఈ రాశుల వారు సరస్వతీ దేవిని ఇలా పూజిస్తే అన్నింటా విజయాలే!

Vasant Panchami 2025 : వసంత పంచమి పండుగ ఫిబ్రవరి 2వ తేదీన వస్తుంది. ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. సరస్వతి అమ్మవారు తన చేతిలో పుస్తకం, వీణ, దండతో తెల్లని కమలంపై కూర్చుని దర్శనమిస్తారు.

Vasant Panchami 2025 : వసంత పంచమి రోజున ఈ రాశుల వారు సరస్వతీ దేవిని ఇలా పూజిస్తే అన్నింటా విజయాలే!

12 Zodiac Signs Follow These Remedies for Saraswati Devi

Updated On : January 31, 2025 / 5:00 PM IST

Vasant Panchami 2025 : వసంత పంచమి సరస్వతి దేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. వసంత పంచమి పండుగను మాఘ మాసంలో శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి పండుగను ఫిబ్రవరి 2న జరుపుకోనున్నారు.

పవిత్రమైన వసంత పంచమిని సరస్వతీ దేవి పండుగగా కూడా జరుపుకుంటారు. అందుకే, ఈ రోజున సరస్వతి మాతను ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారు జ్ఞానానికి, వాక్కుకు, విద్యకు దేవతగా చెబుతారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. వసంత పంచమి రోజున, సరస్వతి దేవి తన చేతుల్లో పుస్తకం, వీణ, దండతో తెల్లటి కమలంపై కూర్చొని కనిపించింది. వసంత పంచమి రోజున సరస్వతి మాతను ఆరాధించడం వల్ల విద్యకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.

Read Also : Gupt Navratri 2025 : గుప్త నవరాత్రులు విశిష్టత.. పూజా విధానం ఏంటి? ఈ 9 రోజులు అమ్మవారిని ఏయే రూపాల్లో ఆరాధించాలంటే?

అలాగే, ఈ రోజున రాశుల ప్రకారం.. కొన్ని పనులు చేయడం ద్వారా సరస్వతి తల్లితో పాటు, సంపదల దేవత లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. వసంత పంచమి రోజున ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవిని తెల్లని వస్త్రాలు ధరించి పూజించి సరస్వతీ కవచాన్ని పఠించండి. ఇది మీకు మేధస్సును ఇస్తుంది. ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది.

వృషభం: సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశి వారు అమ్మవారికి తెల్లటి చందనంతో తిలకం వేసి పుష్పాలు సమర్పించాలి. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

మిథునం : ఈ రాశి వారు సరస్వతి తల్లికి ఆకుపచ్చ కలం సమర్పించి, దానితో తమ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఇది మీ రాతపరమైన సమస్యలను పరిష్కరించడంలో సాయపడుతుంది.

కర్కాటకం: ఈ రాశి వారు తల్లి సరస్వతికి ఖీర్ సమర్పించాలి. ముఖ్యంగా సంగీత రంగానికి సంబంధించిన విద్యార్థులు దీని వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు.

సింహం: ఈ రాశి వారు సరస్వతి మాతను పూజించే సమయంలో తప్పనిసరిగా గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి.

కన్య : ఈ రాశి వారు పేద పిల్లలకు పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు వంటి స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయాలి. ఇలా చేయడం వల్ల చదువులోని ఏమైనా అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

తుల : ఈ రాశి వారు బ్రాహ్మణుడికి తెల్లని వస్త్రాలను దానం చేయాలి. విద్యార్థులు ఇలా చేస్తే వాక్కు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వృశ్చికం : మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే.. సరస్వతీ మాతను ఆరాధించడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. పూజ తరువాత ఎవరికైనా ఎరుపు రంగు పెన్నును బహుమతిగా ఇవ్వండి.

Read Also : RajaShyamala Deeksha : ఈ నెల 30 నుంచే శ్రీరాజశ్యామల నవరాత్రులు.. రాజశ్యామల దీక్ష ఎలా చేయాలి.. ఎప్పుడు స్వీకరించాలి? ఏ మాలను వేసుకోవాలంటే?

ధనుస్సు: సరస్వతీ దేవికి పసుపు మిఠాయిలు సమర్పించండి. మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉన్నత విద్య కోసం మీ కోరికలను కూడా తల్లి సరస్వతి నెరవేరుస్తుంది.

మకరం: ఈ రాశి వారు తెల్లని ధాన్యాలను అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేస్తే సరస్వతి మాత ఆశీస్సులు పొందుతారు. అంతేకాదు.. మీ తెలివితేటలు కూడా పెరుగుతాయి.

కుంభం : ఈ రాశి వారు పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మీపై ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

మీనం: ఈ రాశి వారు ఈ రోజున చిన్నారులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కెరీర్‌లో వచ్చే సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చు.