ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.. ఇలాచేస్తే చాలు..
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాల వివరాలు...

ఈ వారం (సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు) మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయా? మీరు ఏ దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుంది? వంటి వివరాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ తెలిపారు.
గురువు మిధునం శని మున రాశిలో వక్రగతి
రాహు కేతువులు కుంభ సింహరాశిలో
శుక్రుడు సింహం కుజుడు తులలో
రవి బుధులు కన్యా రాశిలో.. అక్టోబర్ 2 నుంచి బుధుడు తులా రాశిలో సంచారము, చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభ రాశులలో సంచారం
మేషం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారు సమయానుకూలంగా నడుచుకుంటే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు, మిత్రులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆదిత్య హృదయ పారాయణంతో మెరుగైన ఫలితాలు కలుగుతాయి.
వృషభం: ఈ రాశి వారికి అనుకులంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగిపోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, వివాహది శుభకార్యక్రమాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణం చదవటం మేలు చేస్తుంది.
మిధునం: అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు, వృత్తి పరంగా ఎలాంటి ఆటంకాలు, సవాళ్లు లేని ప్రశాంతమైన రోజులు ఉంటాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీని సునాయసంగా అధిగమిస్తారు. విదేశాలకు వెళ్లడం, దూర ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ బంధువుల నుంచి మంచి ఆదరణ శుభవార్తలు మనోబలాన్ని పెంచుతాయి. శ్రీ కనకధార స్తోత్ర పారాయణము చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం: ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి వృత్తి వ్యాపారములలో కార్యసిద్ధి, ఆర్థిక వృద్ధి కలుగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసమే ఆయుధాలుగా అన్ని పనుల్లో అవలీలగా విజయం సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.
సింహం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గిపోతాయి. వ్యాపారస్థులు సమష్ఠి నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూల ఆలోచనలతో ఆనందంగా ఉంటారు. రుణబాధలు తీరిపోతాయి. మీకు ఆత్మ విశ్వాసం పెరగడం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. వృత్తిపరంగా కీలక చర్చలలో పాల్గొంటారు. మీవాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామపారాయణము వల్ల మేలు కలుగుతుంది.
కన్యా: ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సరైన అవకాశాలు లేకపోవడంతో నిరాశతో ఉంటారు. ఆర్థిక సమస్యలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంతానం అభివృద్ధి సంతోషం కలిగిస్తుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. శుభకార్యక్రమాల్లో పోల్గొంటారు. ఈశ్వరుడి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
తుల: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా అంతటా విజయమే. అకస్మిక ధనలాభం, ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. పదోన్నతి ద్వారా ఆదాయ వృద్ధి చెందుతుంది. పిత్రార్జితం కలసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గృహంలో వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది
వృశ్చికం: అదృష్టదాయకంగా ఉంటుంది. అన్నిరంగాలవారు వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయపథంలో సాగిపోవడం వల్ల ఆనందంగా ఉంటారు. ఈ వారమంతా వినోదంగా గడుపుతారు. విందు, వినోదాలు, విహారయాత్రలతో సరదాగా గడిచిపోతుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ వ్యవహారాలు, వృత్తి పరమైన జీవితంలో అంతటా ఆనందమే. శ్రీవిష్ణు విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే మేలు.
ధనుస్సు: ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచు కోవాలి. వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఎటూ చూసినా సమస్యలు చుట్టుముట్టి ఉంటాయి. కాబట్టి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. అనవసర విషయముల్లో కల్పించుకోకూడదు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభకరం
మకరం: అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా చిన్నపాటి సమస్యలు మినహా ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త అవసరము. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. అదృష్టం వరించి అకస్మిక ధనలాభం కలుగుతుంది. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి.
కుంభం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అర్థంలేని చర్చలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. వృత్తివ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. తీర్థయాత్రలు, ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు రుణ భారము నుంచి విముక్తి లభిస్తుంది. శ్రీ కనకధార స్తోత్రపారాయణము వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
మీనం: శుభకరంగా ఉంటుంది. వృత్తిపరంగా పొందిన విజయాల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అధిక లాభములు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢపడతాయి. సంతోషం, శాంతి సంతృప్తితో ఆనందంగా గడిచిపోతుంది. లాభములు, పదోన్నతులు వస్తాయి. గణపతి ఆరాధన వల్ల శుభం జరుగుతుంది.
పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956