Smiley Face Moon: స్మైలీ మూన్ చూసేటప్పుడు చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి? ఏదైనా గుడికి వెళ్లాలా, అభిషేకాలు చేయించాలా?
ఇది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఏకాగ్రతగా చెప్పాలి. భగవంతుడిని చేరుకునే ఏకాగ్రత అందరిలోనూ లోపించింది.

Smiley Face Moon: ఈ నెల 25న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అదే స్మైలీ మూన్. ఈ స్మైలీ మూన్ ను చూసేటప్పుడు ఏదైనా మంత్రం చెప్పుకోవాలా? అదేంటి? ఆ రోజున ఏదైనా గుడికి వెళ్లాలా, అభిషేకాలు చేయించాలా.. జ్యోతిష్యపరంగా దీని వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ మాటల్లో తెలుసుకుందాం.
స్మైలీ మూన్ ఏర్పడినప్పుడు పూజలు ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? మూడు గ్రహాల కలయికలో స్మైలీ ఫేస్ కనిపించబోతోంది కాబట్టి నవగ్రహాల దగ్గర పూజలు చేయించుకోవాలా? ఏదైనా గుడికి వెళ్లడం చేయాలా?
”ఏమీ అక్కర్లేదు. చక్కగా స్నానం చేసి ఆ సమయానికి స్మైలీ మూన్ ను దర్శించుకోవాలి. కళ్లు తెరిచి చూడాలి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. నీ అనుగ్రహం వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను స్వామి. ఎప్పుడూ నా జీవితం సాఫీగా సాగేలా చూడండి. నా జీవితంలో మనశ్శాంతిని ఉంచండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేలా చూడండి. వ్యాపారం, ఉద్యోగం అభివృద్ధి అయ్యేలా అనుగ్రహించండి. ఇలా నమస్కరించుకోవాలి.
మన ఇంట్లోనే ఉండే దేవుడి గదిలో చక్కగా దీపారాధన చేసుకుని మనకొచ్చిన దేవతా శ్లోకాలు చెప్పుకుంటే చాలు. అక్కడే ధాన్యం చేసుకుంటే చాలు. ప్రత్యేకంగా గుడికి వెళ్లి అభిషేకాలు చేయించాల్సిన అసవరం లేదు. పూజలు చేయించాల్సిన అవసరం లేదు. నవగ్రహాలకు ఏదీ చేయాల్సిన అవసరం లేదు.
Also Read: రేపే ఆకాశంలో స్మైలీ మూన్.. చూడొచ్చా, లేదా? చూస్తే మంచిదా, కాదా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు..
చంద్రుడు, శుక్రుడు, శనీశ్వరుడు మంత్రం ఏమైనా చెప్పాలిన అవసరం ఉందా?
మంత్రాలు అంటే అందరికీ నోరు తిరగవు. అందుకని శుక్రాయ నమ: శనేశ్వరాయ నమ: చంద్రాయ నమ: సింపుల్ గా ఈ మంత్రాలు చాలు. ఆ స్వామి వారికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పడం. ఇది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఏకాగ్రతగా చెప్పాలి. భగవంతుడిని చేరుకునే ఏకాగ్రత అందరిలోనూ లోపించింది. వేద మంత్రాలు అందరూ ఉచ్చరించేవి కావు.
ఒకవేళ బీజాక్షరాలు పలకాలి అంటే ఓం చం చంద్రాయ నమ: ఓం షం షణాయ నమ: అని బీజాక్షరాలతో కూడుకుని చెప్పుకోవచ్చు. ఓం శుం శుక్రాయ నమ: అని చెప్పొచ్చు. బీజాక్షరాలు కష్టం అనుకుంటే చంద్రాయ నమ: ఇలా అనుకున్నా సరిపోతుంది” అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ తెలిపారు.