New 7 Seater Cars : దుమ్ము లేపడానికి రెడీ.. 7-సీటర్ ఫ్యామిలీ కార్లు దూసుకొస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఇక మార్కెట్ షేక్ అంతే..!
New 7 Seater Cars : కొత్త కారు కొనేవారికి బిగ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లోకి మహీంద్రా, టాటా, నిస్సాన్ నుంచి సరికొత్త 7 సీటింగ్ కార్లు రాబోతున్నాయి.. ఓసారి లుక్కేయండి..
New 7 Seater Cars
New 7 Seater Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. భారత ఆటో మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. అందులో ప్రత్యేకించి ఫ్యామిలీ సైజడ్ ఎస్‌యూవీ, ఎంపీవీలకు భారీగా క్రేజ్ కనిపిస్తోంది. మార్కెట్ డిమాండ్ బట్టి వాహన తయారీదారులు కూడా సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నారు.
ప్రధానంగా మహీంద్రా, టాటా, నిస్సాన్ (New 7 Seater Cars) రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో కొత్త 7-సీటర్ కార్లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ప్రతి మోడల్ కొత్తగా డిఫరెంట్ లుక్ డిజైన్‌తో కొనుగోలుదారులను ఆకర్షించేలా ఉండనున్నాయి. ఈ రాబోయే కొత్త కార్ల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మహీంద్రా XEV 9S :
మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ లైనప్‌లో మహీంద్రా XEV 9S అనే మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కారు తీసుకురానుంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ 3-వరుసల సీటింగ్ ఈవీ కారు వస్తోంది. మహీంద్రా XEV 9e BE 6 కన్నా ఎక్కువ ప్రీమియం క్యాబిన్ లేఅవుట్‌ను అందిస్తుంది. డిజైన్ XUV.e8 కాన్సెప్ట్‌కి దగ్గరగా పోలి ఉంటుంది. ఆకర్షణీయమైన అడ్వాన్స్ ఫీచర్లతో ఉంటుంది.
ఈ ఎస్‌యూవీ మహీంద్రా INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. కంపెనీ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ ఫ్యూచర్ ఆధారంగా నమ్ముతారు. బ్యాటరీ మోటార్ కలయిక పరంగా 9S XEV 9e BE 6 ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. టాప్ ట్రిమ్‌లలో రియల్ టైమ్ డ్రైవింగ్ రేంజ్ దాదాపు 500 కి.మీ వరకు ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించే ఈవీ కొనుగోలుదారులకు అద్భుతమైన ఆప్షన్.
టాటా సఫారీ (పెట్రోల్) :
టాటా మోటార్స్ పాపులర్ సఫారీ హారియర్‌లలో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తీసుకురానుంది. కొత్త 1.5-లీటర్, 4 సిలిండర్ల, టర్బోచార్జ్డ్ హైపెరియన్ పెట్రోల్ ఇంజిన్ దాదాపు 168PS పవర్, 280Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో మాన్యువల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ కనిపిస్తాయి.
అయితే, ప్రస్తుతం టాటా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ టైప్ సీక్రెట్‌గా ఉంచుతోంది. కొత్త పెట్రోల్ ట్రిమ్‌లు డిసెంబర్‌లో రానున్నాయి. ధరలు డీజిల్ వేరియంట్ల కన్నా తక్కువగా ఉంటాయి. ఈ ట్రిమ్‌లు ముఖ్యంగా డీజిల్ టార్క్ అవసరం లేని వినియోగదారులు, సిటీలలో నడిపే కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంటాయి.
మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్ :
మహీంద్రా XUV 700 కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో రానుంది. ఈ ICE మోడల్ అడ్వాన్స్ ఫీచర్లు, అడ్వాన్స్ ఇంటీరియర్‌తో వస్తుంది. బయటి డిజైన్‌లో కొన్ని చిన్న స్టైలింగ్ అప్‌డేట్‌లు కనిపిస్తాయి. అయితే, క్యాబిన్‌లో భారీ మార్పు ఉంటుంది.
స్పెషల్ అప్‌డేట్ ఏమిటంటే.. 3 స్క్రీన్‌ల సెటప్, 12.3-అంగుళాల బిగ్ టచ్‌స్క్రీన్, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డెడికేటెడ్ ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్ కలిగి ఉంది. అదనంగా, అనేక కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్‌ను టెక్-ప్లేయర్‌లకు మరింత ఆకర్షణీయమైన మోడళ్లగా చెప్పవచ్చు.
నిస్సాన్ కాంపాక్ట్ MPV :
నిస్సాన్ కూడా భారత మార్కెట్‌లోకి కొత్త కాంపాక్ట్ MPV మోడల్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ట్రయల్స్ సమయంలో చాలాసార్లు కనిపించింది. MPV రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. మాడ్యులర్ సీటింగ్‌తో సరసమైన ధర ఉండొచ్చు. ఈ నిస్సాన్ ఎంపీవీ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కానుంది. ఇందులో కొత్త మిడ్‌సైజ్ SUV 7-సీటర్ SUV ఉన్నాయి. మోడల్ భారీగా లోకలైజడ్ ధరలు చాలా పోటీగా ఉంటాయని భావిస్తున్నారు.
