CEO Nalin Negi : 90 గంటల పని సాధ్యం కాదు.. గంటల కన్నా పనిలో నాణ్యత ముఖ్యం.. : సీఈఓ నలిన్ నేగి
CEO Nalin Negi : వారానికి 90 గంటలు వర్క్ చేయడమే ఎంతో కష్టం. ఎన్ని గంటల పాటు పనిచేశామనేది కాదు.. నాణ్యత చాలా ముఖ్యమన్నారు.

CEO Nalin Negi
CEO Nalin Negi : భారత్‌లో వారానికి పని గంటలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కొంతమంది పనిగంటలే ముఖ్యమని అభిప్రాయపడుతుంటే.. మరికొందరు పనిగంటలు కన్నా చేసే పని నాణ్యత అత్యంత ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చల నేపథ్యంలో ఉద్యోగుల పనిచేసే చోట ఉత్పాదకతను పెంచేందుకు ఎక్కువ పని గంటల కన్నా నాణ్యత అవసరమని ఆర్థిక సాంకేతిక సంస్థ (BharatPe) సీఈఓ నలిన్ నేగి అన్నారు. పని నాణ్యత ‘ఫస్ట్’.. పని గంటల సంఖ్య కాదని అన్నారు.
Read Also : TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం.. నిలిచిపోయిన సర్వీసులు.. ట్రంప్ నిర్ణయంపైనే కంపెనీ ఆశలు..!
భారత్‌పేలో పని వేళలకు సంబంధించి మాకు పెద్దగా అంచనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 90 గంటలు పని చేయడం చాలా కష్టమని అన్నారు. పని విషయంలో ఏది బెస్ట్ అని అడిగితే అది నాణ్యత అని మాత్రమే చెబుతానని తెలిపారు. కార్పొరేట్ ఇండియాలో పనివేళలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, లార్సెన్&టూబ్రో (ఎల్ అండ్ టీ) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ ఆదివారం ఉద్యోగుల పనిగంటల విధానంపై విచారం వ్యక్తం చేశారు.
వారానికి 90 గంటలు వర్క్ చేయడమే ఎంతో కష్టమన్నారు. అసలు ఎన్ని గంటల పాటు పనిచేశామనేది కాదు.. ఆ పని ద్వారా కంపెనీకి వచ్చే ఉత్పాదకత నాణ్యత చాలా ముఖ్యమన్నారు. మా కంపెనీని ప్రారంభించి 6ఏళ్లు పూర్తి అవుతుంది. భారత్‌పే కంపెనీ ఉద్యోగులతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండాలనేది మా అభిమతం. కంపెనీ అనేది జాబ్స్ మాత్రమే ఇవ్వదు.. ఉద్యోగులకు అద్భుతమైన ఫ్యూచర్ అందించేదిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఆ విషయంపైనే దృష్టిసారించామని ఓ ఇంటర్వ్యూలో నలిన్ నెగీ అభిప్రాయపడ్డారు.
90 గంటల పనిపై నాకు నమ్మకం లేదు :
వారానికి 90 గంటలు పనిపై తనకు నమ్మకం లేదన్నారు. ఒక ఉద్యోగి సౌకర్యవంతంగా పని చేయగలిగితే అది సంస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఉద్యోగి ఎక్కువ గంటలు చేయాలని భావిస్తే సమస్య లేదు.. అంతేకానీ, దానికి మరొకరి సూచన ఎంతమాత్రం అక్కర్లేదని స్పష్టం చేశారు.
‘ఇంట్లో ఉండి ఎంతసమయం భార్యను చూస్తూనే ఉంటారు? ఇంట్లో తక్కువగా ఉండి.. ఆఫీసులోనే ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలని, ఏదైనా అవసరం అనిపిస్తే.. ఆదివారాలు సైతం పనిచేయాలని ఎల్&టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు చేయడం చాలా వివాదాస్పదమయ్యాయి. వ్యాపారవేత్తలు సహా అనేక కార్మిక సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నలిన్ నెగీ పని విషయంలో క్వాలిటీ ఉండాలి తప్ప పనిగంటలు ఎక్కువ కాదని అన్నారు.
సుదీర్ఘ పని గంటలు, పని-జీవిత సమతుల్యత వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మళ్లీ మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉత్పాదకతను పెంచేందుకు యువత వారానికి 70 గంటల పాటు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి గతంలో సూచించారు. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ కూడా కఠినమైన పని గంటలను సమర్థించారు. పని చేసేందుకు సులభమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ, వారానికి 40 గంటలు ప్రపంచాన్ని ఎవరూ మార్చలేదని మస్క్ 2018లో ఒక పోస్ట్‌లో అభిప్రాయపడ్డారు.
Read Also : EPFO : ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ పేరులో మార్పు, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చాలా ఈజీ!