కరోనా ఎఫెక్ట్: 7500 ఉద్యోగాల కోత

  • Published By: vamsi ,Published On : July 4, 2020 / 01:41 PM IST
కరోనా ఎఫెక్ట్: 7500 ఉద్యోగాల కోత

Updated On : July 4, 2020 / 2:32 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయుక్తంగా 7,500 ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఆగిపోయాయి. విమాన ప్రయాణాలకు కూడా అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఉద్యోగాలు తియ్యక తప్పని పరిస్థితి అని కంపెనీ ప్రకటించింది.

ఈ క్రమంలోనే ఎయిర్‌ ఫ్రాన్స్‌ 6500 మందిని, హాప్‌లో వెయ్యిమందిని తొలగించనున్నామని వెల్లడించాయి. ఎయిర్‌ ఫ్రాన్స్‌లో మొత్తం 41వేలమంది ఉద్యోగులుండగా, హాప్‌లో 2400మంది పని చేస్తున్నారు. కరోనా దెబ్బకు మూడు నెలల్లో తమ ట్రాఫిక్ 95 శాతం పడిపోగా.. రోజుకు 15 మిలియన్ యూరోల నష్టం వచ్చిందని ఎయిర్‌ ఫ్రాన్స్‌ ప్రకటించింది. 2024 వరకు కోలుకునే ఆశలు లేవని చెబుతున్నారు.

సిబ్బంది ప్రతినిధులతో ఒక రోజు చర్చలు జరిపిన తరువాత, 2022 నాటికి ఎయిర్ ఫ్రాన్స్‌లో 41,000 ఉద్యోగాల్లో 6,500, హాప్‌లో 2,400 ఉద్యోగాల్లో 1,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. తొలగింపులను విధించే ముందు స్వచ్ఛంద నిష్క్రమణలు మరియు ముందస్తు పదవీ విరమణలను ప్రోత్సహిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ఈ ఏడాది 84 బిలియన్ల నష్టాన్ని అంచనా వేస్తున్నాయి, ఆదాయం సగానికి తగ్గింది. పరిశ్రమ కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోరోవైరస్ మహమ్మారి కారణంగా మూడు నెలల్లో దాని ట్రాఫిక్ 95% పడిపోయిందని, రోజుకు 15 మిలియన్ యూరోలను కోల్పోగా.. 2024 వరకు కోలుకునే అవకాశం లేదని ఎయిర్ ఫ్రాన్స్ తెలిపింది.

Read:జేఈఈ, నీట్-2020 సెప్టెంబర్ వరకు వాయిదా