Air India Express : ప్రయాణికులకు రిలీఫ్.. తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!

Air India Express : ప్రతిరోజూ దాదాపు 380 సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌లైన్ ఆదివారం కనీసం 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది, మంగళవారం ఉదయం నాటికి పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారి తెలిపారు.

Air India Express : ప్రయాణికులకు రిలీఫ్.. తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!

Air India Express Members ( Image Credit : Google )

Updated On : May 12, 2024 / 9:57 PM IST

Air India Express : టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అనారోగ్యం పేరిట సిక్ లీవ్ తీసుకుని నిరసనకు దిగిన ఎయిర్‌లైన్ సిబ్బంది తిరిగి విధుల్లో చేరారని క్యాబిన్ క్రూ యూనియన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రద్దు అయిన విమాన సర్వీసులను క్రమంగా పునరుద్దరిస్తోంది.

ప్రతిరోజూ దాదాపు 380 సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌లైన్ ఆదివారం కనీసం 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. అయితే, మంగళవారం ఉదయం (మే 14) నాటికి పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. దీనిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read Also : Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో సంక్షోభం.. 86 సర్వీసులు రద్దు, ప్రయాణికుల అవస్థలు

ఎయిర్‌లైన్‌లో నిర్వహణ పరమైన సంస్థలు, తమ సిబ్బందిలో కొంతమందిపై వివక్ష చూపిందని ఆరోపించిన క్యాబిన్ సిబ్బందిలోని సుమారు 300 మంది సిబ్బంది సెలవుపై వెళ్లారు. అనంతరం సమ్మెకు దిగడంతో అప్పటినుంచి వందలాది విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. తక్షణం విధుల్లోకి రాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని చీఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం 25 మంది క్యాబిన్ సిబ్బందిపై తీసుకున్న చర్యలను క్యారియర్ ఉపసంహరించుకుంది. ఈ సమావేశానికి ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) ప్రతినిధులు హాజరయ్యారు. సిక్ లీవ్‌పై వెళ్లిన క్యాబిన్ సిబ్బంది అందరూ తిరిగి విధుల్లో చేరారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో యూనియన్ తెలిపింది.

అనారోగ్యంతో సెలవులపై వెళ్లిన క్యాబిన్ సిబ్బంది మే 11, 2024 నాటికి తమ విధుల్లో చేరారని పేర్కొంది. అయితే, ఇటీవల ప్రవేశపెట్టిన కంపెనీ షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా కొంతమంది సిబ్బంది ఇంకా సెలవుల్లోనే ఉన్నారని కంపెనీ తెలిపింది. విమానాలు నెమ్మదిగా పునరుద్ధరిస్తున్నామని మంగళవారం ఉదయం నాటికి నెట్‌వర్క్ స్టేబులైజ్ అవుతుందని అధికారి తెలిపారు.

Read Also : Air India Express : సిబ్బంది యాక్షన్.. ఎయిరిండియా రియాక్షన్.. ఏకంగా 30మంది తొలగింపు..!