జియో ఫైబర్‌కు పోటీగా : Airtel ఆఫర్.. set-top-box, Free HD TV

  • Published By: sreehari ,Published On : August 22, 2019 / 12:59 PM IST
జియో ఫైబర్‌కు పోటీగా : Airtel ఆఫర్.. set-top-box, Free HD TV

Updated On : August 22, 2019 / 12:59 PM IST

రిలయన్స్ జియోకు ఎయిర్ టెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. జియో ఫైబర్ సర్వీసుకు పోటీగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ సర్వీసు యాక్టివేషన్ ద్వారా యూజర్లకు సెటప్ టాప్ బాక్సుతో పాటు ఉచితంగా టీవీ అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో సంచలన ప్రకటనతో ఇతర పోటీదారులైన టెలికం ఆపరేటర్లలో దడ పుట్టేసింది. కానీ, ఎయిర్ టెల్ మాత్రం జియోకు తానేమీ తీసిపోనంటూ అదిరే ఆఫర్ తో ముందుకొచ్చింది. జియోనే కాదు.. ఎయిర్ టెల్ కూడా సెటప్ టాప్ బాక్స్‌తో పాటు ఉచితంగా టీవీ కూడా ఆఫర్ ప్రకటించింది. అందిన రిపోర్టుల ప్రకారం.. ఎయిర్ టెల్ డిజిటల్ ఎంటర్ టైన్‌మెంట్, ఫాస్ట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. 

సెప్టెంబర్‌‌లోనే Airtel డివైజ్ లాంచ్ :
సెప్టెంబర్‌ నెలలో కస్టమైజ్ చేసిన ఆండ్రాయిడ్ ఆధారిత సెటప్ టాప్ బాక్స్ లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ ద్వారా ఎయిర్ టెల్ కస్టమర్లు ఈజీగా ప్రీమియం OTT కంటెంట్, స్ట్రీమింగ్ అప్లికేషన్లు, HD TV ఛానళ్లు, వర్చువల్ రియాల్టీ అప్లికేషన్లు, ఇంటరాక్టీవ్ గేమింగ్ సర్వీసులను యాక్సస్ చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెలికం మేజర్ కంపెనీ ఎయిర్ టెల్ బండెల్ స్మార్ట్ సెటప్ టాప్ బాక్సు,  HD LED TV కూడా ఉచితంగా అందించనున్నట్టు రిపోర్టు తెలిపింది.

జియో ఫైబర్ అందించే Welcome Offer ద్వారా 4K సెటప్ టాప్ బాక్సు, 4K లేదా HD LED TV లేదా PC ఫ్రీ ఆఫర్ చేస్తోంది. హోం బ్రాండ్ కస్టమర్లందరూ యానివల్ డేటా ప్లాన్లను ఎంచుకునేలా ఈ ఆఫర్లను జియో అందిస్తోంది. జియోకు పోటీగా ఎయిర్ టెల్ కూడా ఇంటిగ్రేటెడ్ టారిఫ్ ప్యాకులను అందించనుంది. స్మార్ట్ సెటప్ టాప్ బాక్సు సర్వీసును మిడ్ టూ టాప్ ఎండ్ పోస్టుపెయిడ్ మొబైల్ యూజర్లు, హోం బ్రాడ్ బ్యాండ్, DTH డిజిటల్ TV వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుందని రిపోర్టు పేర్కొంది. ఎయిర్ టెల్ కవరేజడ్ టెలికం సర్వీసులు వాడే ఏకీకృత హోం యూజర్లకు అందించనుంది. 

Airtel V-Fiber.. 3 డేటా ప్లాన్లు ఇవే : 
ఎయిర్ టెల్ అందించే బ్రాడ్ బ్యాండ్ సర్వీసు Airtel V-Fiber నుంచి కూడా అదనపు డేటా ఆఫర్ చేస్తోంది. మొత్తం మూడు డేటా ప్లాన్లపై 1K GB డేటా వరకు అందిస్తోంది. 6 నెలల కాల పరిమితితో అదనపు డేటా పొందవచ్చు. ఇప్పటికే రూ.799 డేటా ప్లాన్ ద్వారా 200GB డేటా అదనంగా ఆఫర్ చేస్తుండగా.. 40Mbps స్పీడ్ తో 100GB వరకు లిమిట్ అందిస్తోంది. రూ.1,099 ప్లాన్ పై ఎయిర్ టెల్ వి-ఫైబర్ 6 నెలల పాటు 500GB వరకు అదనంగా పొందవచ్చు. ఒరిజినల్ స్పీడ్ 100Mbpsతో 300GB డేటా వరకు లిమిట్ ఉంటుంది. రూ.1,599 డేటా ప్లాన్‌పై 300Mbps స్పీడ్‌తో 600GB డేటా మాత్రమే కాకుండా 1K GB వరకు ఫ్రీ డేటా అందిస్తోంది. అన్ని మూడు ప్లాన్లలో అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్, వివిధ ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫెట్స్ కూడా యూజర్లు పొందవచ్చు. 

రిలయన్స్ జియో.. జియో ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ సర్వీసును సెప్టెంబర్ 5న కమర్షియల్ లాంచ్ చేయనుంది. ఈ డేటా ప్లాన్లలో నెలకు రూ.700 నుంచి రూ.10వేల వరకు అఫర్ చేస్తోంది. అంతేకాదు.. ఇతర సర్వీసులైన కంటెంట్ స్ట్రీమింగ్, ఆన్ లైన్ గేమింగ్, మిక్సడ్ రియాల్టీ సర్వీసులను కూడా జియో అందించనుంది.