Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ నాడు ‘డిజిటల్ గోల్డ్’ కొన్నారా? గూగుల్ పే, పేటీఎంలో ఇలా కొనేసుకోండి.. ఇదిగో ప్రాసెస్..!
Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ (Akshaya Tritiya) వచ్చేసింది.. ఈరోజున బంగారం కొంటే చాలా మంచిదట.. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా ఫోన్ ద్వారా డిజిటల్ గోల్డ్ (Digital Gold) కొనేసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..

Akshaya Tritiya 2023 _ How to buy digital gold via Google Pay and Paytm, Check Details
Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ (Akshaya Tritiya).. అంటే.. ‘అఖ తీజ్’ (Akha Teej) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాదిలో వైశాఖ మాసంలో జరిగే హిందూ పండుగ. భారత్‌లోని హిందువులు అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున ఎవరైతే బంగారాన్నికొనుగోలు చేస్తారో వారి ఇంట్లో నిరంతర సంపద విరాజిల్లుతుందని విశ్వసిస్తారు. 2023 ఏడాదిలో ఏప్రిల్ 22న అక్షయ తృతీయ వచ్చింది. ఈరోజున శుభ దినంగా భావిస్తారు.
దీపావళి (Diwali), ధంతేరస్ తర్వాత అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఇలా చేస్తే.. తమ జీవితంలోకి శ్రేయస్సు, మరింత అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బంగారానికి ఎప్పుడు విలువ ఉంటుంది. ఈ బంగారాన్ని ఎన్నిసార్లు అయినా కొనుగోలు చేయొచ్చు. అవసరమైనప్పుడు విక్రయించుకోవచ్చు.
అందుకే బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది డబ్బు రూపంలో కాకుండా ఎక్కువగా బంగారంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. ఫిజికల్ గోల్డ్ ధరించాలని కోరుకునే వారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే… వినియోగదారులకు తమ కష్ట సమయాల్లో ఈ బంగారాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాదు.. మార్కెట్లో ‘డిజిటల్ గోల్డ్’ కూడా అందుబాటులో ఉంది. డిజిటల్ గోల్డ్‌పై కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కువ మంది వినియోగదారులు డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. మీ దగ్గర గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) ఉంటే చాలు.. మీ ఫోన్ ద్వారా ఈజీగా డిజిటల్ గోల్డ్ సొంతం చేసుకోవచ్చు.
Read Also : Gold Prices : అక్షయ తృతీయ పండుగకు ముందు పసిడి ప్రియులకు ఊహించని షాక్
డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? :
డిజిటల్ గోల్డ్ అనేది ఫిజికల్ గోల్డ్ మాదిరిగా ఉండదు. ఈ బంగారాన్ని ఫిజికల్‌గా కొనుగోలు చేయలేం. ఈ డిజిటల్ గోల్డ్ అనేది ఒక వర్చువల్ అని చెప్పవచ్చు. డిజిటల్ రూపంలో ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదో వర్చువల్ టెక్నిక్. అంటే.. ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ ఈజీగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇంకా, కనీస కొనుగోలు లేదా అమ్మకం ధర ఒక రూపాయిగా చెప్పవచ్చు. డిజిటల్ బంగారానికి నిర్దిష్ట ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గోల్డ్‌ను భద్రపరచడం, స్టోర్ చేయాల్సిన అవసరం లేదు.

Akshaya Tritiya 2023 _ How to buy digital gold via Google Pay and Paytm, Check Details
ఎప్పుడైనా ఫిజికల్ గోల్డ్ (అసలైన బంగారం) రూపంలో రీడీమ్ (Redeem) చేయవచ్చు. మరో మాటలో చెప్పాలంటే.. ఈ డిజిటల్ గోల్డ్ ద్వారా ఫిజికల్ గోల్డ్‌ను కూడా కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు డిజిటల్ ప్లాట్ ఫారంలైన (Paytm), (Google Pay) వంటి అప్లికేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఇంతకీ Paytm, Google Pay ద్వారా డిజిటల్ గోల్డ్ ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
అక్షయ తృతీయ 2023 : Paytm ద్వారా ఎలా కొనాలంటే? :
* మీ మొబైల్ ఫోన్లో Paytm యాప్‌ని ఓపెన్ చేయండి.
* అన్ని సర్వీసుల (All Services) సెక్షన్‌కు వెళ్లండి
* సెర్చ్ బార్కి వెళ్లి ‘Gold’ అనే పదాన్ని Search చేయండి
* ‘Gold’పై Click చేయండి
* ఈ ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోండి (Buy in Amount or Buy in Grams)
* మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, ‘Proceed’ క్లిక్ చేయండి.
* డిజిటల్ గోల్డ్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయండి.
* మీరు Paytm Wallet, UPI, నెట్ బ్యాంకింగ్ (Netbanking), డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్లు చేయవచ్చు
Google Pay ద్వారా డిజిటల్ గోల్డ్‌పై ఎలా పెట్టుబడి పెట్టాలంటే? :
* మీ ఫోన్లో Google Pay యాప్ ఓపెన్ చేయండి.
* Search Boxలో ‘Gold Locker’ని ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత Gold Locker పదం కోసం సెర్చ్ చేయండి.
* ఇప్పుడు Gold Locker ఆప్షన్‌పై నొక్కండి.
* Buy ఆప్షన్ నొక్కండి.
* మీరు కొనే డిజిటల్ గోల్డ్.. ప్రస్తుత మార్కెట్ కొనుగోలు ధర (పన్నుతో సహా) కనిపిస్తుంది.
మీరు కొనుగోలు చేసిన తర్వాత ఈ ధర 5 నిమిషాల పాటు లాక్ అయి ఉంటుంది. ఎందుకంటే బంగారం కొనుగోలు ధర రోజంతా మారవచ్చు. అందుకే మీరు కొనుగోలు చేసే సమయంలో ఎంత ధర ఉందో అదే ధరకు కొనుగోలు చేయొచ్చు.