Amazon Diwali Sales : అమెజాన్ దీపావళి సేల్స్.. రూ. 10వేల లోపు బెస్ట్ టాబ్లెట్స్ మీకోసం.. ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఎవరైనా కొనేసుకోవచ్చు!

Amazon Diwali Sales : మీరు స్టూడెంట్స్ అయినా లేదా ప్రొఫెషనల్స్ అయినా కేవలం రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి..

Amazon Diwali Sales : అమెజాన్ దీపావళి సేల్స్.. రూ. 10వేల లోపు బెస్ట్ టాబ్లెట్స్ మీకోసం.. ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఎవరైనా కొనేసుకోవచ్చు!

Amazon Diwali Sales

Updated On : October 20, 2025 / 6:07 PM IST

Amazon Diwali Sales : కొత్త టాబ్లెట్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, అమెజాన్ దీపావళి సేల్స్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకే ట్యాబ్స్ లభిస్తున్నాయి. ప్రొఫెషనర్ల నుంచి స్టూడెంట్స్ వరకు ప్రతిఒక్కరూ రూ. 10వేల కన్నా తక్కువ ధరకే టాబ్లెట్లను కొనేసుకోవచ్చు.

ఈ టాబ్లెట్లు భారీ స్క్రీన్లతో పాటు స్ట్రాంగ్ బ్యాటరీ (Amazon Diwali Sales) వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. కెమెరాలు, సీపీయూలు కూడా ఉన్నాయి. భారీ స్క్రీన్ టాబ్లెట్ కోరుకునే యూజర్లకు అద్భుతంగా ఉంటాయి. అందులోనూ భారీ బడ్జెట్ పెట్టలేని వారికి రూ. 10వేల లోపు బెస్ట్ టాబ్లెట్‌లుగా చెప్పొచ్చు.

ఇందులో 10.1 అంగుళాల నుంచి 11-అంగుళాల స్క్రీన్‌లు, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లు, GPS, బ్లూటూత్, వైఫై, డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ సిమ్ కార్డులు, భారీ ర్యామ్ ROM, 13MP బ్యాక్ కెమెరా ఉన్నాయి. మెటల్ కేసింగ్‌లతో ఈ టాబ్లెట్‌లు 8300mAh బ్యాటరీతో వస్తాయి.

ఈ టాబ్లెట్‌లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. ఆఫీసు వర్క్, అధ్యయనానికి సపోర్టు చేస్తాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రూ. 6,799 నుంచి ప్రారంభమవుతాయి. ఫీచర్లు, డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Realme P4 5G Sale : రియల్‌మి ఆఫర్ అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15వేల లోపు ధరకే కొనేసుకోండి.. సెల్ఫీ కెమెరా మాత్రం కేక..!

లెనోవా ట్యాబ్ :
ఈ టాబ్లెట్ Wi-Fi కనెక్టివిటీ, 10.1-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ కలిగి ఉంది. ఈ టాబ్లెట్‌లో రెండు స్పీకర్లు ఉన్నాయి. స్ట్రాంగ్ మెటల్ బాడీతో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ బ్లూ కలర్ టాబ్లెట్‌ను ఆఫీసు, స్టడీ రెండింటికీ ఉపయోగించవచ్చు. ఈ లెనోవా ట్యాబ్ 400 నిట్ బ్రైట్‌నెస్, తేలికైన డిజైన్‌ కలిగి ఉంది.

హానర్ ప్యాడ్ X8a :

మీరు ఆఫస్ వర్క్ కోసం అద్భుతమైన టాబ్లెట్ కోసం చూస్తుంటే ఈ టాబ్లెట్‌ను తీసుకోండి. ఈ యాష్ కలర్ టాబ్లెట్ 11 అంగుళాల సైజులో స్క్రీన్‌ను కలిగి ఉంది. ఫ్లిప్ కవర్‌ను కలిగి ఉంది. హై రిఫ్రెష్ రేట్, స్ట్రాంగ్ 8300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హానర్ ప్యాడ్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. తద్వారా భారీ మొత్తంలో ఆదా చేయవచ్చు.

లెనోవా ట్యాబ్ M11 :
ఈ టాబ్లెట్‌లోని 11-అంగుళాల భారీ స్క్రీన్ హై రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 13MP బ్యాక్ కెమెరా ఉంది. లెనోవా ట్యాబ్ M11 మోడల్ Wi-Fi కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ద్వారా పవర్ పొందుతుంది. ఈ టాబ్లెట్ మల్టీ టాస్కింగ్‌కు సరైనది. ఏడాది వారంటీతో వస్తుంది. అలాగే, 128GB స్టోరేజీ కలిగి ఉంది. మీ అన్ని కీలకమైన డాక్యుమెంట్లు, ఫైల్‌లను అక్కడే స్టోర్ చేసుకోవచ్చు.

డోమో స్లేట్ SL39 :
ఈ టాబ్లెట్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి. 32GB స్టోరేజీ కూడా ఉంది. 10.1-అంగుళాల IPS HD LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 2G, 3G, 4G సిమ్ కార్డులను సపోర్ట్ చేసే రెండు సిమ్ స్లాట్‌లను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ చౌకైన ధరకు లభిస్తుంది. విద్యార్థులకు అద్భుతమైన ఆప్షన్.