Amazon Great Indian Festival Sale : అమెజాన్ పండగ సేల్ డిస్కౌంట్లు.. ఈ శాంసంగ్ S24 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Amazon Great Indian Festival 2025 : శాంసంగ్ కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Amazon Great Indian Festival 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. అమెజాన్ పండగ సేల్ సందడి మొదలైంది. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 24 గంటల మందుగానే సేల్ అందుబాటులోకి రానుంది.

ఈ మెగా సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు శాంసంగ్ అభిమాని అయితే మీకోసం గెలాక్సీ S24 అల్ట్రాపై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ దాదాపు సగం ధరకే లభిస్తుంది.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర తగ్గింపు : 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ.1,29,999 ఉండగా అమెజాన్‌లో రూ.71,999కి కొనుగోలు చేయవచ్చు. అంతే కాదు, ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి కూడా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ ఎల్‌టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. శాంసంగ్ 7 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కూడా ఉంది.

కెమెరా విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 10MP టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.