Blinkit Ambulance : బ్లింకిట్ సరికొత్త ఎమర్జెన్సీ సర్వీసు.. ఇకపై కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్..!

Blinkit Ambulance : గురుగ్రామ్‌లో 5 అంబులెన్స్‌లతో బ్లింకెట్ అంబులెన్స్ సర్వీసు ప్రారంభమైంది. బ్లింకిట్ అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) వంటి ముఖ్యమైనవి ఉంటాయి.

Blinkit Ambulance : బ్లింకిట్ సరికొత్త ఎమర్జెన్సీ సర్వీసు.. ఇకపై కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్..!

Ambulance In 10 Minutes

Updated On : January 3, 2025 / 5:23 PM IST

Blinkit Ambulance : ప్రముఖ క్విక్ కామర్స్ ఫ్లాట్‌ఫారమ్ బ్లింకిట్ సరికొత్త సర్వీసును గురుగ్రామ్‌లో ప్రారంభించింది. జనవరి 2, 2025 నుంచి బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఫాస్ట్ డెలివరీకి పేరుగాంచిన బ్లింకిట్ ఇకపై 10 నిమిషాల్లోనే అంబులెన్స్ సేవలను అందిస్తుంది. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఈ సర్వీసు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also : Sankranthiki Vasthunnam : నిజామాబాద్‌లో వెంక‌టేష్ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ట్రైల‌ర్ లాంచ్‌ ఈవెంట్‌.. ఎప్పుడో తెలుసా?

ప్రారంభంలో ఈ సర్వీసును గురుగ్రామ్‌లో ప్రారంభించగా, త్వరలో ఇతర నగరాల్లో కూడా బ్లింకెట్ అంబులెన్స్ సేవలను విస్తరించనుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని గురుగ్రామ్‌లో 5 అంబులెన్స్‌లతో ఈ సర్వీసు ప్రారంభమైంది. బ్లింకిట్ అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) వంటి ముఖ్యమైన డివైజ్‌లు ఉంటాయి.

దీనికి సంబంధించి కంపెనీ సీఈఓ అల్బిందర్ ధింద్సా ట్విట్టర్ (X) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘మొదటి 5 అంబులెన్స్‌లు ఈరోజు నుంచి గురుగ్రామ్‌లో రోడ్స్ పైకి వస్తాయి. ఈ సర్వీస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన @letsblinkit యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్‌ని బుక్ చేసుకునే అప్షన్ చూస్తారు. మా అంబులెన్స్ సర్వీసులను వేగంగా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నాం” అని పేర్కొన్నారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో బ్లింకిట్ ముందుగా 5 అంబులెన్స్‌లను ప్రారంభించగా, రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని ప్రాంతాలకు ఈ అంబులెన్స్ సర్వీసులను విస్తరించాలని భావిస్తోందని అల్బిందర్ ధింద్సా తెలిపారు.

“లాభం ఇక్కడ లక్ష్యం కాదు. మేం ఈ సేవను వినియోగదారులకు సరసమైన ధరకు అందిస్తాం. ఎంతోకాలంగా ఉన్న ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే సర్వీసు ఉద్దేశం”గా స్టార్టప్ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. బ్లింకిట్ రాబోయే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్లింకిట్ ఈ అంబులెన్స్ సేవను ప్రారంభించామని, ప్రాణాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని ధిండ్సా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బ్లింకిట్ అంబులెన్స్‌ని ఎలా బుక్ చేసుకోవాలి? :
అంబులెన్స్ సర్వీస్ బుకింగ్ చాలా సులభం. మీరు బ్లింకిట్ యాప్‌ని విజిట్ చేయడం ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్‌ని బుక్ చేసుకోవచ్చు. ఈ అంబులెన్స్ సర్వీసు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా పనిచేస్తుంది.

బ్లింకిట్ అంబులెన్స్ ఫీచర్లు ఇవే :
కొత్తగా ప్రారంభమైన బ్లింకిట్ అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, మానిటర్లతో పాటు స్ట్రెచర్‌లు, వైద్య పరికరాలు ఉంటాయి. అంతేకాదు.. ఇతర మెడికల్ టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. “మా బ్లింకెట్ అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్), మానిటర్, స్ట్రెచర్, అత్యవసర మందులు, ఇంజెక్షన్‌లతో పాటు ప్రాణాపాయ పరిస్థితుల్లో రక్షించే పరికరాలు ఉన్నాయి ” అని బ్లింకిట్ సీఈఓ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే, ప్రతి అంబులెన్స్‌లో పారామెడిక్, హెల్పర్, శిక్షణ పొందిన డ్రైవర్ కూడా ఉంటారు.

Read Also : China HMPV Outbreak : చైనాలో వేగంగా విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్.. లక్షణాలు, నివారణ చర్యలేంటి?