China HMPV Outbreak : చైనాలో వేగంగా విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్.. లక్షణాలు, నివారణ చర్యలేంటి?
China HMPV Outbreak : చైనా ప్రస్తుతం హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV)తో పోరాడుతోంది. దేశంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు అనేక మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్ట్‌లు సూచిస్తున్నాయి.

China HMPV Outbreak : కరోనా భీభత్సాన్ని ప్రపంచమంతా ఇంకా మరచిపోలేదు. ఐదేళ్ల తర్వాత చైనాలో మరో భయంకరమైన వైరస్ భీభత్సం సృష్టిస్తోంది. పొరుగుదేశమైన చైనా ప్రస్తుతం కొత్త వైరస్ హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV)తో పోరాడుతోంది. దేశంలో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు అనేక మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తోన్న వార్తలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోల్లో ఆస్ప్రతుల్లో రద్దీతో కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. ప్రస్తుత కేసులకు ఇదే కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోనే ప్రభావం అధికంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
Read Also : Namrata Shirodkar : బాబోయ్.. 2024లో మహేష్ ఫ్యామిలీ ఎన్ని దేశాలు తిరిగారో తెలుసా? మహేష్ భార్య పోస్ట్ వైరల్…
ఎవరిపై ఎక్కువగా ప్రభావం ఉంటుందంటే? :
హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదల ఆకస్మిక మరణాల రేటు, 40 ఏళ్ల వయస్సు నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల్లోనే ఈ వైరస్ తీవ్ర ప్రభావం ఉంటుందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు.. శ్మశానవాటికలపై భారం పెరిగిపోయిందని, పిల్లలలో న్యుమోనియా పెరుగుతోందని, ‘వైట్ లంగ్’ కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయని అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో పోస్టులు సూచిస్తున్నాయి.
కానీ, చైనా ఆరోగ్య అధికారులు (HMPV)ని ఇప్పటివరకూ అంటువ్యాధిగా గుర్తించలేదు. అయితే, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబరేటరీని ఏర్పాటు చేసి వ్యాధి నియంత్రణ, నివారణ ఏజెన్సీల కోసం కేసులను ధృవీకరించడానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అక్యూట్ రెస్పిరేటరీ వ్యాధుల డేటా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 22 వారంలో మొత్తం ఇన్‌ఫెక్షన్లలో పెరుగుదలను చూపించిందని అధికారిక ప్రకటన వెల్లడించింది. SARS-CoV-2 (COVID-19) హ్యాండిల్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని పేర్కొంది.
హెచ్ఎంపీవీతో పాటు, ఇన్‌ఫ్లుఎంజా ఎ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వైరస్‌లతో సహా అనేక వైరస్‌లు దేశంలో త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెరుగుతున్న న్యుమోనియా, ‘వైట్ లంగ్’ కేసులతో పీడియాట్రిక్ ఆస్పత్రిల్లో ఇబ్బందిగా మారిందని సోషల్ మీడియా హ్యాండిల్ నివేదించింది. చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) అనే శ్వాసకోశ వ్యాధి అంటే ఏంటి? దీని లక్షణాలు, ఎలా వ్యాపిస్తోంది.. ఎవరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
⚠️ BREAKING:
China 🇨🇳 Declares State of Emergency as Epidemic Overwhelms Hospitals and Crematoriums.
Multiple viruses, including Influenza A, HMPV, Mycoplasma pneumoniae, and COVID-19, are spreading rapidly across China. pic.twitter.com/GRV3XYgrYX
— SARS‑CoV‑2 (COVID-19) (@COVID19_disease) January 1, 2025
హెచ్ఎంపీవీ అంటే ఏంటి? :
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) అనేది సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలను ఉన్న ఒక వైరస్. సాధారణ సందర్భాల్లో, దగ్గు లేదా శ్వాస ఇబ్బందులు, ముక్కు కారటం లేదా గొంతు నొప్పికి కారణమవుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హెచ్ఎంపీవీ లక్షణాలేంటి? :
ఈ వైరస్ బారిన పడితే ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. హెచ్ఎంపీవీ వైరస్‌ను 2001లో గుర్తించారు. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. సీడీసీ ప్రకారం.. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే ఇతర వైరస్‌ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.
హెచ్ఎంపీవీ నివారణ :
హెచ్ఎంపీవీ వ్యాప్తిని నివారించడానికి, ఆరోగ్య అధికారులు కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. కడుక్కోని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటి ప్రాంతాన్ని తాకరాదు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను నివారించండి.
హెచ్ఎంపీవీకి చికిత్స లేదా వ్యాక్సిన్ ఉందా? :
ప్రస్తుతం, హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా అభివృద్ధి చేయలేదు. లక్షణాలను నివారించడానికి సాధారణ సహాయక సంరక్షణ ఒక్కటే మార్గమని చెప్పవచ్చు. జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు మాస్క్ ధరించాలి. తరచుగా చేతులు కడుక్కోవడం కూడా చాలా అవసరం.
హెచ్ఎంపీవీ వైరస్‌కు కోవిడ్-19 తేడా ఏంటి? :
హెచ్ఎంపీవీ, కోవిడ్-19 వైరస్ చాలా సారూప్య లక్షణాలను కలిగి ఉన్నాయి. రెండు వైరస్‌లు దగ్గు, జ్వరం, గురక, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. ఏప్రిల్ 2024లో వైరాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కోవిడ్-19 తర్వాత, చైనాలోని హెనాన్‌లో హెచ్ఎంపీవీ కేసులు పెరిగాయి. ఏప్రిల్ 29 నుంచి జూన్ 5, 2023 మధ్య ప్రతిరోజూ దాదాపుగా హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్లను గుర్తించారని అధ్యయనం వెల్లడించింది.
హెచ్ఎంపీవీ కొత్త మహమ్మారి ఉద్భవించనుందా? :
అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు, నివేదికలు చైనా మరో భయంకర వైరస్‌తో పోరాడుతుందని పేర్కొన్నప్పటికీ, ఆరోగ్య అధికారులకు అత్యవసర పరిస్థితి గురించి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికీ, హెచ్ఎంపీవీకి నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. వైరస్ గురించి అవగాహన, ముందు జాగ్రత్త, నివారణ చర్యలు మాత్రమేనని సూచిస్తున్నారు. 2023లో, నెదర్లాండ్స్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, చైనాలలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కనుగొన్నారు.
Read Also : Plane Crash: కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం.. భవనం పైకప్పును ఢీకొట్టిన ఘటనలో పలువురు మృతి