ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ : ఇండియాలో భారీగా తగ్గిన ఐఫోన్ XR, XS

  • Published By: sreehari ,Published On : September 11, 2019 / 12:11 PM IST
ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ : ఇండియాలో భారీగా తగ్గిన ఐఫోన్ XR, XS

Updated On : September 11, 2019 / 12:11 PM IST

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ కొత్త మోడల్స్ ఐఫోన్ 11 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యాయి. సెప్టెంబర్ 10న కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో స్టీవ్ జాబ్స్ థియేటర్లో కంపెనీ గ్రాండ్ రిలీజ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ లాంచింగ్ తో ఇండియాలో ఇదివరకే ఆపిల్ రిలీజ్ చేసిన పాత స్మార్ట్ ఫోన్ల ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. భారత మార్కెట్లలో ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ 7 మోడల్ ధరలు భారీగా తగ్గిపోయాయి. 

రూ.27వేలు తగ్గిన ఐఫోన్ XR : 
2018 ఏడాదిలో ఇండియాలో ఆపిల్ ఐఫోన్ XR మోడల్ అసలు ధర రూ.79వేల 900. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.49వేల 900గా ఉంది. అంటే.. రూ.27వేల వరకు తగ్గింది. ఆపిల్ ఐఫోన్ XS అసలు ధర మార్కెట్లో రూ.99వేల 900 కాగా.. ప్రస్తుతం.. ప్రారంభ ధర రూ.89వేల 900గా అందుబాటులో ఉంది. అంటే.. రూ.10వేల వరకు తగ్గింది. ఆపిల్ ఐఫోన్ XR (64GB స్టోరేజీ) వేరియంట్ రూ.49వేల 900 ఉంటే.. 128GB మోడల్ ధర రూ.54వేల 900గా ఉంది. ఇక ఆపిల్ ఐఫోన్ XS (256GB) వేరియంట్ పాత ధర రూ.1లక్ష 14వేల 900గా ఉంటే.. ప్రస్తుతం.. రూ.1లక్ష 03వేల 900గా ఉంది. అంటే.. రూ.11వేల వరకు తగ్గింది. 

ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్ (64GB) ఫోన్ ఇప్పుడు రూ.49వేల 900లకే అందుబాటులో ఉంది. ఐఫోన్ 8 (64GB) మోడల్ ధర రూ.39వేల 900గా ఉంది. ఆపిల్ పాత జనరేషన్ ఐఫోన్ 7 ఫోన్ (32GB) ధర రూ.29వేల 900గా ఉంటే.. 128GB వేరియంట్ ధర రూ.34వేల 900తో అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ (32GB), 128GB రెండు మోడల్ ధరలు వరుసగా రూ.37వేల 900, రూ.42వేల 900గా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ XS Max, ఐఫోన్ X స్మార్ట్ ఫోన్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 

ఇండియాలో ఆపిల్ కొత్త ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ల ధరలను కంపెనీ రివీల్ చేయడంతో ఆపిల్ పాత ఐఫోన్ మోడల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఐఫోన్ XR సక్సెసర్ (64GB, 128GB, 256GB మోడల్స్) పర్పల్, గ్రీన్, ఎల్లో, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ (రెడ్) కలర్లలో ఉన్నాయి. ఈ ఐఫోన్ మోడల్స్ ప్రారంభ ధర రూ.64వేల 900గా ఉంది. ఆపిల్ ఐఫోన్ 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధరలు రూ.99వేల 900, రూ.1లక్ష 09, 900గా ఉన్నాయి. సెప్టెంబర్ 27 నుంచి కొత్త ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ల సేల్స్ ప్రారంభం కానుంది.